నవతెలంగాణ – ఎర్రుపాలెం
ఈ నెల జరగనున్న శాసనసభ ఎన్నికలలో మధిర అ సెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మల్లు భట్టి విక్రమార్క తొమ్మిదో తారీఖున నామినేషన్ వేనున్న సందర్భంగా నాయకులు, కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి పిలుపునిచ్చారు. మండల కేంద్రమైన ఎర్రుపాలెం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 9వ తేదీన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నామినేషన్ కార్యక్రమం నిర్వహించబడుతున్నదని, ఉదయం తొమ్మిది గంటలకి కార్యకర్తలందరూ క్యాంప్ కార్యాలయానికి రావాలని సూచించారు. అనంతరం ర్యాలీగా బయలు దేరి నామినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటలకు పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా ఇందిరాగాంధీ సభా ప్రాంగణం వద్ద భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరుగుతుందని ఈ కార్యక్రమాలను విజయ వంతం చేయవలసిందిగా కాంగ్రెస్ కార్యకర్తలకు, నాయకులకు అభిమానులను కోరారు. కార్యక్రమంలో డిసిసిపి బ్యాంక్ డైరెక్టర్ ఐలూరి వెంకటేశ్వర్‌రెడ్డి, శీలం ప్రతాపరెడ్డి, బండారు నరసింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీనివాసరావు, తల్లపురెడ్డి నాగిరెడ్డి, అనుమోలు వెంకటకృష్ణా రావు, మల్లెల లక్ష్మణరావు, శీలం వెంకటరామిరెడ్డి, వేజెండ్ల సాయికుమార్, షేక్ ఇస్మాయిల్, కంచర్ల వెంకట నరసయ్య, రాజీవ్‌గాంధీ, భూక్య శ్రీనివాసరావు, గుడేటి బాబురావు, అనిల్‌కుమార్, రాజేష్, ఏడుకొండలు పాల్గొన్నారు.