వలస ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతాం

– సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించండి
– కారం పుల్లయ్య గెలుపు కోసం పార్టీ శ్రేణులు విస్తృత ప్రచారం
నవతెలంగాణ-చర్ల
వలస ఆదివాసీల హక్కుల కోసం పోరాడుతామని, సీపీఐ(ఎం) అభ్యర్థిని ఎమ్మెల్యేగా గెలిపించాలని పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కే.బ్రహ్మచారి వలస ఆదివాసీలకు విజ్ఞప్తి చేశారు. సీపీఐ(ఎం) అభ్యర్థి కారం పుల్లయ్యకు సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపైన ఓట్లు వేయాలని అభ్యర్థిస్తూ బక్కచింతలపాడు ఆదివాసి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బ్రహ్మచారి మాట్లాడుతూ నాలుగు దశాబ్దాలుగా ఇక్కడ స్థిర నివాసాలు ఏర్పరచుకొని జీవనం సాగిస్తున్న వలస ఆదివాసీలు సాగు చేస్తున్న పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, వారికి ఎస్టీ కుల ధ్రువీకరణ పత్రాలు ఇవ్వాలని, విద్య, వైద్యం, వ్యవసాయ అభివృద్ధి తదితర సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీల సంక్షేమానికి అభివృద్ధికి సీపీఐ(ఎం) కట్టుబడి ఉందని, తాము గెలిస్తే అసెంబ్లీ వేదికగా వలస ఆదివాసీల సమస్యలపై ప్రభుత్వంపై పోరాడుతామని పేర్కొన్నారు. పులిగుండాల, కుర్నపల్లి ఎర్రబూరు, గ్రామాలలో ఇంటింటి ప్రచారంతో పాటు సభలు సమావేశాలు నిర్వహించారు. ఈ సభల్లో పార్టీ జిల్లా కమిటీ సభ్యులు రేపాకుల శ్రీనివాస్‌, పార్టీ మండల కార్యదర్శి కారం నరేష్‌ మాట్లాడారు. అమ్ముడు పోయే వారిని కాకుండా ఆదివాసీల హక్కుల కోసం పోరాడే సీపీఐ(ఎం) అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా 30 వేల ఎకరాల పోడు భూములు పంచి వాటికి హక్కు పత్రాలు సాధించిన ఏకైక పార్టీ సీపీఐ(ఎం) అని గుర్తు చేశారు. కొత్తపల్లి, ఆనంద కాలనీ గ్రామాల్లో పార్టీ మండల కమిటీ సభ్యులు మచ్చ రామారావు, పామర్‌ బాలాజీ ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా చర్ల మండలాన్ని అభివృద్ధి పథంలో నడిపించుకోవడం సాధ్యమవుతుందన్నారు. గుంపెనగుడం, కేశవాపురం గ్రామాలలో పార్టీ మండల కమిటీ సభ్యురాలు పొడుపుగంటి సమ్మక్క, జిల్లా కమిటీ నాయకులు కొమరం కాంతారావు ఆధ్వర్యంలో ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. పూసుగుప్ప గ్రామంలో పార్టీ మండల నాయకులు దొడ్డి హరినాగ వర్మ ఆధ్వర్యంలో మాజీ సర్పంచ్‌ రామకృష్ణ తదితరులు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. గ్రామ గ్రామాన గ్రూప్‌ మీటింగులు జనరల్‌ బాడీలు ఇంటింటి ప్రచారాలు నిర్వహిస్తున్నారు. 8వ తేదీన సీపీఐ(ఎం) అభ్యర్థి నామినేషన్‌ సందర్భంగా భద్రాచలంలో భారీ ర్యాలీతో పాటు బహిరంగ సభ ఉంటుందని పార్టీ అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సీపీఐ(ఎం) నాయకులు వీరయ్య, మండల కమిటీ సభ్యులు శ్యామల వెంకటేశ్వర్లు, నాయకులు, తాటి కన్నారావు, కారం అయిత, కారం రాజు, కారం మంగయ్య, సోడి మంగయ్య, కుంజా రాజబాబు, ఇరపసత్యం, రమేష్‌, రామకృష్ణ, నాగేశ్వరరావు, గుండి చిన్నబి, గంగయ్య తదితరులు పాల్గొన్నారు.