గ్రామీణ మహిళలకు ఆర్ధిక భరోసా

Financial security for rural womenలూమ్స్‌ ఆఫ్‌ లడఖ్‌… ఇది ఒక సహకార సంస్థ. 16 గ్రామాలకు చెందిన 450 మందికి పైగా మహిళలు వ్యాపారంలో చూపిస్తున్న ఉత్సాహం, పట్టుదలకు చక్కని ఉదాహరణ. వీరంతా కలిసి లడఖీ పష్మినాను ప్రపంచానికి పరిచయం చేసేందుకు పూనుకున్నారు. దీని కోసం సమిష్టిగా కృషి చేస్తున్నారు. ఈ సంస్థ సహ వ్యవస్థాపకు రాలైన అభిలాషా బహుగుణ దీని గురించి మరిన్ని విశేషాలు మనతో పంచుకుంటున్నారు…

2013లో అభిలాషా బహుగుణ న్యూఢిల్లీలో నివసించేది. అక్కడ కొంతమంది కాశ్మీరీ పష్మినా అమ్మకందారులతో తన ఇంటి యజమాని ఆవేశంగా బేరసారాలు చేయడం విన్నది. ఈ సంఘటనను వెంటనే ఫేస్‌బుక్‌ పోస్ట్‌ చేసింది. ఇంతటి నాణ్యమైన ఉత్పత్తులు చేస్తూ వీరంతా ఇలా అసంఘటితంగా ఎందుకున్నారనే ఆలోచన వచ్చింది. చేతివత్తులవారంతా కలిసి సహకార సంఘాన్ని ఏర్పాటు చేయగలిగితే ఇలాంటి బేరసారాల సమస్య ఉండదని ఆమెకు అనిపించింది. అభిలాష పంజాబ్‌, నెదర్లాండ్స్‌లోని టిల్‌బర్గ్‌ విశ్వవిద్యాలయం నుండి తన చదువు పూర్తి చేసింది.
నైపుణ్య అభివద్ధి కార్యక్రమాలు
కేవలం మూడేండ్లలో లడఖ్‌లోని 16 గ్రామాలకు చెందిన 450 మంది మహిళలతో కలిసి ఫామ్‌-టు-ఫ్యాషన్‌ అనే సహకారం సంఘాన్ని నిర్మించగలదని ఆమె అనుకో లేదు. దీని కోసం ఐఎఎస్‌ అధికారిగా ఉన్న ఆమె భర్త జి. ప్రసన్న ప్రోత్సాహం కూడా చాలా ఉంది. ప్రసన్న 2015లో లేV్‌ాలో డిప్యూటీ కమిషనర్‌గా నియమితులయ్యారు. అతను చుమూర్‌ గ్రామానికి చెందిన మహిళల బృందాన్ని కలుసుకు న్నాడు. వారు అతనికి కొన్ని అల్లిన పష్మినా సాక్స్‌లను చూపించారు. ”లడఖ్‌ వంటి ప్రాంతంలో అటువంటి నైపుణ్యం ఉన్న మహిళలను చూసి ఆయన కదిలిపోయాడు. ఇది 150 మంది మహిళలతో ఈ ప్రాంతంలో ప్రాజెక్ట్‌ లక్సల్‌ అనే నైపుణ్య అభివద్ధి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టడానికి అతన్ని ప్రేరేపించింది. వారు అల్లికలో శిక్షణ పొందారు’ అని ఆమె గుర్తుచేసుకుంది.
అందరి ప్రశంసలు అందుకుంది
ఇతర రాష్ట్రాల మాదిరిగా లడఖ్‌లో పష్మినా కోసం వస్త్ర సమూహాలు లేవు. కుటుంబం గడవడం కోసం అల్లడం, నేయడం వంటి నైపుణ్యాలు ఎన్నో తరాల నుండి వారు కొనసాగిస్తున్నారు. ఇది అది వ్యాపారంగా మాత్రం మారలేదు. పష్మినా మేకలను 4,000-5,000 మీటర్ల ఎత్తులో ఉన్న చాంగ్‌పాస్‌ అనే సంచార జాతులు పెంచుతారు. కానీ లడఖ్‌ ముడిసరుకు ఆర్థిక వ్యవస్థగా మిగిలిపోయింది. అయితే కాశ్మీరీ పష్మినా అందరి ప్రశంసలు అందుకుంది. సంస్థ ఆధ్వర్యంలో స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌, డిజైన్‌ ఇంటర్వెన్షన్‌లో వివిధ గ్రామాలకు చెందిన మహిళలు ఒకచోట చేరారు. వారు ఇప్పుడు ఉత్పత్తులను తయారు చేస్తున్నారు. వాటిని వివిధ ఫెయిర్‌లు, ఎగ్జిబిషన్‌లలో విక్రయిస్తున్నారు. ప్రముఖ షోరూమ్‌లకు తమ ఉత్పత్తులను అందిస్తున్నారు. ఈ మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే సహకార సంఘమే సరైన మార్గమని అభిలాష భావించింది. అయితే కొన్ని అడ్డంకులు ఎదురయ్యాయి. ‘కొన్ని అడ్డంకులను ప్రతిఘటిస్తూ 2017లో సహకారాన్ని నమోదు చేసాము. నిధుల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దాంతో నాలుగేండ్లు సొంతంగా లడఖ్‌లోని లూమ్స్‌ను నడిపాము’ అని ఆమె చెప్పింది. మహిళలు హిల్‌ డెవలప్‌మెంట్‌ కౌన్సిల్‌ను ఆశ్రయించగా, వారు వారి దక్పథాన్ని, వారి కష్టాలను అర్థం చేసుకుని రాయితీపై అద్దెకు స్థలం ఇచ్చారు.
స్వయంప్రతిపత్తిగా ఉండాలనుకున్నాం
ఐదేండ్ల తర్వాత మహిళలు సంస్థను నడపడం, పుస్తకాలు, జాబితా, అమ్మకాలు, ఇతర విధులను నిర్వహించడంలో ప్రవీణులయ్యారు. ‘అప్పటికి లడఖ్‌ మగ్గాలు బాగా ప్రసిద్ధి చెందాయి. కానీ ప్రభుత్వంతో కలిసి పనిచేయడం మాకు ఇష్టం లేదు. బయటి నియంత్రణ లేకుండా స్వయంప్రతిపత్తిగా ఉండాలనుకున్నాం. అయితే ఇది తప్పుడు సంకేతాన్ని పంపింది. అయినప్పటికీ మేము NABARD వారి ఎన్‌ఏబీ ఫౌండేషన్‌ని సంప్రదించాం. వారు మమ్మల్ని చాలా ఆప్యాయంగా కలుసుకున్నారు. 2022లో మాకు కోటి రూపాయలు మంజూరు చేసారు’ అని అభిలాష చెప్పారు.
స్వతంత్య్ర భావాన్ని కలిగిస్తుంది
ప్రస్తుతం నేత కార్మికులు నెలకు సగటున రూ.15 వేలు, రంగులు వేసే వారికి దాదాపు రూ.15 వేలు, టైలర్లు నెలకు రూ.18 వేల వరకు సంపాదిస్తున్నారు. ‘సంస్థ ఆఫీస్‌ బేరర్‌గా, ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌, ప్రదర్శనలు, ఫెయిర్‌లలో ఉత్పత్తులను ప్రదర్శించడం గురించి నేను చాలా నేర్చుకున్నాను. కస్టమర్‌లతో మాట్లాడి ఉత్పత్తులను విక్రయించగలమనే నమ్మకం నాకుంది. నేను క్యాషియర్‌ పదవిని చేపట్టాను. ఆర్థిక నిర్వహణ కోసం జు=ూ నేర్చుకున్నాను’ అని ఆమె చెప్పింది. ఏడాది కిందట లూమ్స్‌లో చేరిన సోనమ్‌ ‘రెండు నెలల శిక్షణ తర్వాత నేను లూమ్స్‌ ఆఫ్‌ లడఖ్‌లో టైలరింగ్‌ ప్రారంభించాను. అలాంటి బ్రాండ్‌తో అనుబంధం కలిగి ఉండటం ఆనందంగా ఉంది. ఈ పని నాకు స్వతంత్య్ర భావాన్ని కలిగిస్తుంది’ అన్నది.