– రూరల్‌లో తమ్మినేని తనయుడు సంఘమిత్ర విస్తృత ప్రచారం
నవతెలంగాణ- ఖమ్మంరూరల్
పాలేరులో సీపీఐ(ఎం) గెలవడం ఖాయమని పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఉరడీ సుదర్శన్‌రెడ్డి అన్నారు. పాలేరు సిపిఎం అభ్యర్థిగా పోటీ చేస్తున్న తమ్మినేని వీరభద్రంను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సిపిఎం శ్రేణులు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మండలంలోని ఏదులాపురం, ఎం.వెంకటాయపాలెం, తల్లంపాడు, కాచిరాజు గూడెం, మద్దులపల్లి, తెల్దారుపల్లి, పొన్నెకల్లు, పోలేపల్లి, ముత్తగూడెం, ఆరేకోడు, రాజీవ్ గహ కల్ప గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదులాపురం గ్రామంలో తమ్మినేని వీరభద్రం తనయుడు తమ్మినేని సంఘమిత్ర ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా గడపగడపకు వెళ్లి సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుకు ఓటేయ్యాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.పేద ప్రజల తరుపున మాట్లాడే వ్యక్తిని చట్టసభలకు పంపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు నందిగామ కృష్ణ, పి.సంగయ్య, పి.మోహన్‌రావు, తమ్మినేని వెంకట్రావు, దోనోజు లక్ష్మయ్య, కోటి శ్రీనివాస్, యామిని ఉపేందర్, పొన్నం వెంకటరమణ, సిలువేరు బాబు, వడ్లమూడి నాగేశ్వరరావు, పాపిట్ల సత్యనారాయణ, జక్కంపూడి నాగేశ్వరరావు, గుమ్మడి నర్సయ్య, వల్లెపు సోమరాజు, ఉరడీ విజరు రెడ్డి, దుండిగల నాగయ్య, వెంకటేశ్వర్లు, గంధం నాగేశ్వరరావు, పొన్నెకంటి అనిష్,మామిండ్ల మధు పాల్గొన్నారు.