మధ్యతరగతి వ్యాపార వర్గాలలో దూసుకుపోతున్న సీపీఐ(ఎం)

నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణ వ్యాప్తంగా మధ్యతరగతి వ్యాపార వర్గాలలో సీపీఐ(ఎం) ఎన్నికల గుర్తు సుత్తి కొడవలి చుక్క దూసుకుపోతుందని స్పష్టమవుతుంది. యువకుడు సంస్కార వంతుడైన కారం పుల్లయ్య అభ్యర్థిని పట్టణంలోని వ్యాపార మధ్యతరగతి వర్గాలు పూర్తిస్థాయిలో బలపరుస్తున్నట్టుగా కొట్టచిన్నట్టు కనబడుతుంది. ప్రధానంగా పట్టణంలోని నాలుగో వార్డు పరిధిలో గొల్ల బజార్‌, ఇందిరా మార్కెట్‌, సూపర్‌ బజాజ్‌ సెంటర్‌తోపాటు కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాలలో వ్యాపార మధ్య తరగతి సెక్షన్ల ఎన్నికల బాధ్యులైన పార్టీ పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు భీమవరం వెంకరెడ్డి, నాలుగో వార్డ్‌ మాజీ వార్డ్‌ మెంబర్‌ బండారు శరత్‌ బాబు నేతృత్వంలో అభ్యర్థి కారం పుల్లయ్య డోర్‌ టు డోర్‌ ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో వ్యాపారస్తులు పెద్ద ఎత్తున కారం పుల్లయ్యకు స్వాగతం పలికి భద్రాచలం నియోజవర్గంలో సీపీఐ(ఎం) లేని లోటు ఈ ఐదు సంవత్సర కాలంలో చూసామని భవిష్యత్తులో అలాంటి పొరపాటు మరోసారి జరగకుండా కారం పుల్లయ్యను గెలిపించుకుంటామని హామీ ఇచ్చారు. మధ్యతరగతి కుటుంబాలలోని ప్రజలు కూడా భద్రాచలం అభివృద్ధికి ఒక రూపాయి నిధులు కేటాయించని అహంకారి బిఆర్‌ఎస్‌ పార్టీకి ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పి భద్రాచల ప్రజల ఐక్యతను కేసీఆర్‌కు రుచి చూపిస్తామని స్పష్ట చేస్తున్నారు. భద్రాచలం పట్టణాన్ని నిర్లక్ష్యం చేస్తున్న బీఆర్‌ఎస్‌కి అభివృద్ధికి నిధులు సాధించలేని కాంగ్రెస్‌ పార్టీకి ఏకకాలంలో బుద్ధి చెప్పి ఈ ఎన్నికలలో సీపీఐ(ఎం) తిరిగి గెలిపించుకొని భద్రాచల పరిరక్షణకు కట్టుబడి ఉంటామని ఇటు మధ్యతరగతి అటు వ్యాపార వర్గా ప్రజలు ముక్తకంఠంతో ఆ పార్టీ నాయకత్వ బృందానికి హామీ ఇచ్చి ప్రోత్సహిస్తున్నారు. సీపీఐ(ఎం) ఆదరణను చూపిస్తున్న ప్రజలకు కారం పుల్లయ్య ధన్యవాదాలు తెలుపుతూ తనను గెలిపిస్తే భద్రాచల సమగ్ర అభివృద్ధికి నిర్దిష్టమైన ప్రణాళికతో ప్రజలందరూ భాగస్వామిని చేసి అభివద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు మచ్చ వెంకటేశ్వర్లు, ఏజే.రమేష్‌, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎంబి .నర్సారెడ్డి, పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి, జిల్లా సోషల్‌ మీడియా బాధ్యులు బి. రమేష్‌, కార్యదర్శి వర్గ సభ్యులు వెంకట రామారావు, సంతోష్‌, పట్టణ కమిటీ సభ్యులు నాగరాజు, చేకోటి శ్రీనివాస్‌, కొరడ శ్రీనివాస్‌, తదితరులు పాల్గొన్నారు.