చట్టసభల్లో కమ్యూనిస్టులుండాలి

– సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు
నవతెలంగాణ-మధిర
కార్మిక వర్గం పేద కడుపులు నింపే ఎర్రజెండా కావాలా ప్రజలను దోసుకునే బిఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ కావాలా అనేది ప్రజలు అలోచించి ఓట్లయాలనీ సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరావు కోరారు. మధిర నియోజకవర్గం సీపీఎం అభ్యర్థి పాలడుగు భాస్కర్‌ గెలుపు కోసం మధిర మండలం ఖమ్మంపాడు శాఖ కార్యదర్శి భాదినేని వెంకట నర్సయ్య అధ్యక్షత జరిగిన జనరల్‌ బాడీలో అయన మాట్లాడారు. అనంతరం కామ్రేడ్‌ పాలడుగు భాస్కర్‌ విజయాన్ని కాంక్షిస్తూ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిరహించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు మద్దాల ప్రభాకరావు, దెందుకూరు గ్రామ కార్యదర్శి అల్లూరి నాగేశ్వరరావు, షేక్‌ సైదులు, అంగడాల అమరయ్య, కంచం కృష్ణ, షేక్‌ రహీం, ఖాసీం షాహెబ్‌, లాల్‌ షాహెబ్‌, వజ్రమ్మ, నరసింహారావు పాల్గొన్నారు.