చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవకే నా జీవితం అంకితం

– స్థానికుడు కావాలా…స్థానికేతరులు కావాలా..?
– ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని నేను
– రానున్నది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం : ఎన్నికల ప్రచారంలో వనమా, కోనేరు, ఎడవల్లి
నవతెలంగాణ-కొత్తగూడెం
నా చివరి రక్తం బొట్టు వరకు ప్రజాసేవకే నా జీవిత అంకితం చేస్తానని, స్థానికుడు కావాలా… స్థానికేతరులు కావాలా..? అని కొత్తగూడెం నియోజక వర్గం ఎమ్మెల్యే అభ్యర్ధి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. బుధవారం సుజాతనగర్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగపేట, లక్ష్మీదేవిపల్లి, గరీబుపేట సెంటర్‌, ఎస్సీ కాలనీ లక్ష్మీపురం తండా, నిమ్మలగూడెం, పాత నిమ్మలగూడెం, కోమటిపల్లి, సీతంపేట బంజర, సీతంపేట, రాంజీ తండా, రెడ్డిపాలెం, చింతల్‌ తండా, మర్రితండ, హరిజన తండా, మాల బంజరలలో పర్యటించి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా వనమా వెంకటేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ, ఎడవల్లి కృష్ణ మాట్లాడారు. లోకల్‌లో ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడిని, స్థానికుడు కావాలా….? స్థానికేతరులు కావాలా…? విజ్ఞత కలిగిన ఓటర్లు నిర్ణయించుకోవాలని కోరారు. గూడెం అభివృద్ధి తనతోనే సాధ్యమని అనునిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సహకారంతో సాయశక్తుల అభివృద్ధికి కృషి చేశానన్నారు. చివరి రక్త బొట్టు వరకు ప్రజాసేవకే తన జీవితం అంకితం అన్నారు. రానున్నది బిఆర్‌ఎస్‌ ప్రభుత్వమేనని, బీఆర్‌ఎస్‌ అభ్యర్థికే ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. మండల పరిధిలో జరిగిన ఈ ప్రచారంలో వనమాకు మహిళలు ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ఐదోసారి కొత్తగూడెం ఎమ్యెల్యే అయ్యి వనమా చరిత్ర సృష్టిస్తారు : డాక్టర్‌ వనమా అలేఖ్య
కొత్తగూడెం నియోజకవర్గంలో ఇంతవరకు ఎవరు కూడా ఐదు సార్లు ఎమ్మెల్యే కాలేదని, ఈ సారి వనమా కొత్తగూడెం నియోజకవర్గానికి ఐదో సారి ఎమ్మెల్యే అయ్యి చరిత్ర సృష్టిస్తారని వనమా మనవరాలు డాక్టర్‌ అలేఖ్య అన్నారు. పాత పాల్వంచ యూత్‌ నిర్వహించిన రోడ్‌ షోకు హాజరైన వనమా అలేఖ్య స్థానిక ఆంజనేయస్వామి దేవాలయం, పాత పాల్వంచ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు చేసి, రోడ్‌ షోగా చర్చి లైన్‌ గ్రౌండ్‌ వద్ద ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.వనమా అలేఖ్య మాట్లాడుతూ మా సొంత ఊరు అయినా పాతపాల్వంచ ప్రజలు మాకు అండగా ఉన్నారని, బంపర్‌ మెజారిటీతో ప్రతిసారి గెలిపిస్తున్నారని, పాత పాల్వంచలో సెంటర్‌ నుంచి బొడ్రాయి వరకు వేసిన డబల్‌ బీటి రోడ్డు, సెంటర్‌లో బస్‌ స్టాప్‌, కొత్తగా నిర్మించిన పశుఆసుపత్రి, పెద్దబడి స్కూల్లో అదనపు తరగతుల నిర్మాణము ఇవన్నీ అభివృద్ధికి నిదర్శనం అని రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేసుకుందామని, సీఎం కెసిఆర్‌ బలపరిచిన వనమా కారు గుర్తుకు ఓటేయాలని ప్రజలను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో వనమా మనీషా, బిఆర్‌ఎస్వి అధ్యక్షులు బత్తుల మధుచంద్‌, యూత్‌ నాయకులు ఫరీద్‌, తంబళ్ల నాగ సత్యం, రెడ్డిమల్ల మణికంఠ, వాసుమల్ల రాంబాబు, ధర్మరాజుల శంకర్‌, దేవుడు సాయి, బర్ల అన్వేష్‌, కంచర్ల రామారావు, పెద్దలు ముక్తేవి రంగమ్మ, లింగమర్ల రాజ్యలక్ష్మి, సునీత, శ్రీదేవి, తిరుపతమ్మ, శ్రీలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.