నవతెలంగాణ-దుమ్ముగూడెం
ఈనెల 31వ తేదీన జరిగే అసెంబ్లీ ఎన్నికలలో భద్రాచలం అసెంబ్లీ స్థానం నుండి సిపిఐ(ఎం) అభ్యర్థిగా పోటీ చేస్తున్న కారం పుల్లయ్య గెలుపును కోరుతూ పార్టీ శ్రేణులు గ్రామాలలో విస్తృతంగా ప్రచార నిర్వహిస్తున్నారు. మారుమూల గిరిజన గ్రామమైన కొమ్మనాపల్లిలో జరిగిన ఇంటింటి ప్రచారంలో సీపిఐ(ఎం ) మండల కమిటీ సభ్యులు సరియం ప్రసాద్ మాట్లాడుతూ… పుల్లయ్యను అసెంబ్లీకి పంపితే సున్నం బట్టి వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించి మారుమూల గిరిజన గ్రామాల ప్రజలకు సాగు త్రాగునీరు సౌకర్యంతో పాటు, విద్య, వైద్యం, రహదారుల అభివద్ధి కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తాడన్నారు. ప్రతి ఒక్కరూ సుత్తి కొడవలి నక్షత్రం గుర్తుపై ఓట్లు వేసి కారపు లైను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి తిరుగుతూ చేస్తున్న ప్రచారానికి గిరిజన గ్రామాల ప్రజల నుండి అనూహ్యస్పందన వస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువకులు పాల్గొన్నారు.