
– ఐటీడీఏ పేసా కోఆర్డినేటర్ కొమురం ప్రభాకర్
నవతెలంగాణ -తాడ్వాయి
చేపల పెంపకం తో ఆర్థిక సాధికారత వైపు గిరిజన మత్స్య పారిశ్రామిక సంఘాలు లతో శుక్రవారం గిరిజనులతో తక్కలపాడు చెరువులో ఐటీడీఏ పేసా కోఆర్డినేటర్ కొమరం ప్రభాకర్ అధ్యక్షతన నైపుణ్యత పరీక్ష నిర్వహించారు. మత్య్స శాఖ ఫీల్డ్ ఆఫీసర్ రమేష్ మాట్లాడుతూ వలలు విషరడం, ఈత కొట్టడం, వల లాగడం లాంటి మూడు రకాల పరీక్షలు నిర్వహించారు. సొసైటీ ల ఏర్పాటు ద్వారా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు అమలుచేయుచున్న మత్స్య సంక్షేమ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకొని, ఆర్థికంగా అభివృద్ధి చెందాలని కోరారు. పెసా జిల్లా సమన్వయ కర్త కొమురం ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజనుల్లో నీలి విప్లవాన్ని ప్రోత్సహిస్తుందన్నారు. ఉచిత చేప పిల్లలతో పాటు, తెప్పలు75 శాతం రాయితీ తో మోటార్ వాహనాలు ఇస్తుందన్నారు. జీవిత బీమా పథకం కింద 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ కూడా కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.రెండు గిరిజన మత్స్య పారిశ్రామిక స
హకార సంఘాలు , మరొకటి మత్స్య పారిశ్రామిక సంఘాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో, నార్లాపూర్ స్థానిక సర్పంచ్ సిద్దబోయిన చిన్నక్క, బయ్యక్కపేట సర్పంచ్ గుర్రం రమా సమ్మిరెడ్డి, కొమురం ప్రభాకర్ పెసా కోఆర్డినేటర్ , చందా మహేష్ , తాడ్వాయి మత్స్య సొసైటీ అధ్యక్షుడు మల్లెల మనోహర్ , తాడ్వాయి మత్స్య సొసైటీ అధ్యక్షుడు బంగారి సాంబయ్య , బయ్యక్కపేట మత్స్య సొసైటీ అధ్యక్షుడు ఎలా శ్రీకాంత్ , మత్య్స సిబ్బంది క్రిష్ణ , PESA మోబిలైజర్స్ నార్లాపూర్ అళ్ళెం రాజేష్ , తాడ్వాయి అళ్ళెం నవీన్ తదితరులు పాల్గొన్నారు.
