– ప్రచారంలో దూసుకుపోతున్న ఆచారి
నవతెలంగాణ-ఆమనగల్
ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని కల్వకుర్తి అసెంబ్లీ బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కడ్తాల్ మండలంలోని నేరెల్ల కోల్, చెన్నారం, వాసుదేవ్ పూర్, కాడియా తాండా, రాజీవ్ నగర్ తదితర గ్రామాల్లో ఆయన స్థానిక నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. గత 35 సంవత్సరాలుగా నియోజకవర్గం అభివృద్ధి కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్న తనను ఒకసారి ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిస్తే కల్వకుర్తి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. గతంలో రెండుసార్లు ఆతి తక్కువ ఓట్లతో ఓటమి పాలైన తనను ప్రస్తుత ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను వేడుకున్నారు. ఈకార్యక్రమంలో నాయకులు మాన్య నాయక్, రాందాస్ నాయక్, సాయిలాల్ నాయక్, రెడ్యా నాయక్, వీరయ్య, కేకే శ్రీను ముదిరాజ్, రవి రాథోడ్, వెంకటేష్ పాల్గొన్నారు. అదేవిధంగా ఆచారి సతీమణి తల్లోజు గీత ఆమనగల్ మున్సిపాలిటీలో ఇంటింటి ప్రచారం నిర్వహించి ఆచారిని ఆశీర్వదించాలని ఓటర్లను వేడుకున్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కండె హరిప్రసాద్, మున్సిపల్ చైర్మెన్ నేనావత్ రాంపాల్ నాయక్, కౌన్సిలర్లు చెన్నకేశవులు, కృష్ణ యాదవ్, కోఆప్షన్ సభ్యులు యాదమ్మ, మేడిశెట్టి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.