సాహితీ వార్తలు

జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2023
గుంటూరు రావిరంగారావు సాహిత్య పీఠం నిర్వహించే ‘జన రంజక కవి ప్రతిభా పురస్కారాలు 2023’ కు సంబంధించిన వివరాలు ప్రకటించింది. 2019 నుండి 2023 వరకు ప్రచురింతమైన పద్యం, వచన కవిత, దీర్ఘ కవిత, గేయం, లఘు కవితలు, బాల గేయాలు మొదలైన కవితా సంపుటాలను ఆహ్వానిస్తోంది. ఎంపికైన పుస్తకాల కవులకు ఒక్కొక్కరికి రెండువేల రూపాయల నగదు, జ్ఞాపిక, శాలువాతో 2024, ఫిబ్రవరిలో జరిగే సాహిత్య సభలో సత్కరిస్తారు. పుస్తకాలను కన్వీనరు, రావి రంగారావు సాహిత్య పీఠం, శంఖచక్ర నివాస్‌, అన్నపూర్ణ నగర్‌, తూర్పు, 5వ లైను, గోరంట్ల, గుంటూరు – 522034 చిరునామాకు డిసెంబర్‌ 31 లోగా పంపాలి.
– నర్రా ప్రభావతి, కన్వీనర్‌
26న ‘ఆజాదీ’ ఆవిష్కరణ
కరిపె రాజ్‌కుమార్‌ కవితా సంపుటి ‘ఆజాదీ’ ఆవిష్కరణ సభ ఈ నెల 26న ఆదివారం ఉదయం 10.30 గంటలకు బాగ్‌ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలోని షోయబ్‌ హాల్‌లో నిర్వహించనున్నారు. డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌ అధ్యక్షతన నిర్వహించే ఈ కార్యక్రమంలో పుస్తకాన్ని కె. ఆనందాచారి ఆవిష్కరిస్తారు. సభలో డా. కాంచనపల్లి గోవర్థనరాజు, కొమ్మవరపు విల్సన్‌రావు, ఎం. నారాయణశర్మ ప్రసంగిస్తారు.

– పాలపిట్ట బుక్స్‌