మార్టిన్ మద్దతుతో ప్రయాంత భాగస్వామ్యంతో ‘మలేరియా హ్యాక్ ఫెస్ట్ – ప్రెడిక్ట్, ప్లాన్

– మార్టిన్ మద్దతుతో ప్రయాంత భాగస్వామ్యంతో ‘మలేరియా హ్యాక్ ఫెస్ట్ – ప్రెడిక్ట్, ప్లాన్ & ప్రివెంట్ (నివారించు)నిర్వహించిన TiE ఢిల్లీ-ఎన్సీఆర్, మలేరియా నిర్వహణకు ఐటీ-సదుపాయం గల పరిష్కారాలకు ఆహ్వానం
మలేరియాతో పోరాడటానికి లక్ష్యభరితమైన పరిష్కారాలు కేటాయించడానికి భారతదేశంలో ప్రముఖ టెక్ స్కూల్స్ ను ఆహ్వానించిన హ్యాక్ ఫెస్ట్; రూ. 5 లక్షలు వరకు బహుమతులు పొందవచ్చు
నవతెలంగాణ –
ఢిల్లీ: మార్టిన్ మద్దతుతో ఐటీ సదుపాయం గల ఆవిష్కరణ ఆధారిత హ్యాక్ ఫెస్ట్, ‘మలేరియా హ్యాక్ ఫెస్ట్ – ప్రెడిక్ట్ (ఊహించు), ప్లాన్ (ప్రణాళిక చేయు) & ప్రివెంట్ (నివారించు) నిర్వహణకు ప్రయాంతతో TiE ఢిల్లీ – ఎన్ సీఆర్ తమ భాగస్వామ్యాన్ని ప్రకటించింది. ఈ చొరవతో, ప్రయాంతతో భాగస్వామ్యంలో TiE ఢిల్లీ-ఎన్ సీఆర్  నిఘా, ప్రదేశాన్ని గుర్తించడం మరియు మలేరియా  వ్యాప్తిని ముందస్తుగా ఊహించడంలో పరిష్కారాలను కోరుతోంది. ఈ అంతరాలను పరిష్కరించడానికి స్టార్టప్స్ కోసం ప్రణాళిక చేసే లక్ష్యంతో హ్యాక్ ఫెస్ట్ కు రావలసిందిగా దేశంలో అన్ని ప్రముఖ టెక్ స్కూల్స్ అనగా ఐఐటీలు, ఎన్ఐటీలు, ఐఐఐటీలను ప్రోగ్రాం ఆహ్వానిస్తోంది. విజేత రూ. 5 లక్షల వరకు బహుమతులను గెలుచుకోవచ్చు. ఈ చొరవ గురించి మాట్లాడుతూ, రవి భట్నాగర్, డైరక్టర్, ఎక్స్ టర్నల్ అఫైర్స్, పార్ట్ నర్ షిప్స్, ఎస్ఓఏ, రెకిట్, ఇలా అన్నారు “యాంటీబయోటిక్ నిరోధకత, వాతావరణం మార్పు, వాహకం లక్షణాలు వంటి ఆధునిక కాలంలో నిరంతరంగా మారుతున్న మలేరియా పోకడల స్వభావం వలన భారతదేశంలో మలేరియా వ్యాప్తి సమస్యను సమర్థవంతంగా పరిష్కరించడానికి సాంకేతిక సదుపాయం గల ఆవిష్కరణలను వినియోగించడం కీలకం. ప్రముఖ సాంకేతిక స్కూల్స్ నుండి దేశంలో నైపుణ్యం గల యువత సహాయంతో, మలేరియాను నివారించి, దేశం యొక్క పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి  ఈ కార్యక్రమం పరిష్కారాలను అభివృద్ధి చేయాలని కోరుతోంది.”మలేరియాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ పోరాటానికి దోహదపడే ఆవిష్కరణ పరిష్కారాలు అభివృద్ధి చేయడానికి సాంకేతికత & ఉమ్మడి తెలివి యొక్క శక్తిని పొందడమే ప్రాథమిక లక్ష్యం. మలేరియా నివారణ, వ్యాధి నిర్థారణ & చికిత్సలో కీలకమైన సవాళ్లను పరిష్కరించడానికి సృజనాత్మకత, సహకారం & విలక్షణంగా ఆలోచించడాన్ని ప్రోత్సహించడం పై ఈ కార్యక్రమం దృష్టి సారిస్తుందని” ప్రతీక్ కుమార్, ప్రెసిడెంట్, ప్రయంత అన్నారు. గీతిక దయాళ్, ఈడీ, TiE ఢిల్లీ-ఎన్ సీఆర్, ఇలా అన్నారు, “తమ ఐటీ-సౌకర్యం ఆవిష్కరణ ద్వారా మలేరియా వ్యాప్తి సమస్యను తగ్గించడంలో సహాయపడే కొత్త స్టార్టప్స్ ను ఆహ్వానించడం పై ప్రోగ్రాం దృష్టి కేంద్రీకరించింది. తమ ఆవిష్కరణలు ప్రదర్శించడానికి ఔత్సాహికులు & స్టార్టప్స్ కోసం ఒక ప్లాట్ ఫాంను కేటాయించడానికి TiE ఢిల్లీ ఎన్ సీఆర్ కీలకమైన పాత్ర పోషించింది. కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా దోమలు కలిగించే వ్యాధులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో సాధనంగా నిలవగలిగే  ఈ విలక్షణమైన చొరవ పై రెకిట్ తో భాగస్వామ్యం చెందడానికి మేము ఆనందిస్తున్నాం.”
భారతదేశంలో ఐటీ సదుపాయం గల ఆవిష్కరణ ద్వారా మెరుగుదల అవసరమైన మలేరియా గురించి ఆందోళన కలిగించే ప్రధానమైన విషయాలు ఈ కింది విధంగా ఉన్నాయి :

  1. వాస్తవిక సమయం నిఘా వ్యవస్థల విధాన నిర్ణేతలు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మరియు కార్యక్రమాన్ని అమలుచేసే వారి కోసం మలేరియా వ్యాప్తి మరియు హాట్ స్పాట్స్ కారకం, వాతావరణం మార్పు, తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వర్షాలు, చెట్లు, జంతువులు వంటి నిర్వచించబడిన నమూనాలతో దోమల బెడద యొక్క నమూనాలు పై దృష్టి కేంద్రీకరించాయి.
  2. వాతావరణ మార్పు, విపరీతమైన ఉష్ణోగ్రతలు, వర్షాలు, చెట్లు మరియు జంతువులు వంటి దోమల వ్యాప్తి మరియు మలేరియా వ్యాప్తిని అంచనా వేయడం, AQI, Accuweather , విద్యావేత్తలు, విధాన రూపకర్తలు, కార్యక్రమం అమలు మరియు సాధారణ జనాభా నుండి వినియోగదారులు అందర్నీ లక్ష్యంగా పెట్టుకుంది.

     3 . విధానాలు రూపకల్పన చేసే వారు, ఆరోగ్య సంరక్షణ సిబ్బంది మరియు కార్యక్రమాన్ని అమలుచేసే వారిని లక్ష్యంగా చేసుకుని దోమల పునరుత్పత్తి ప్రాంతాలు మరియు మలేరియా వ్యాపించే హాట్ స్పాట్ ప్రదేశాల గ్రేడియంట్ హీట్ మ్యాపింగ్.
4.
అట్టడుగు స్థాయి నుండి జాతీయ స్థాయికి (i-iii)  పెంచబడే నమూనా.