కాంగ్రెస్ ప్రభుత్వం తోనే  సుపరిపాలన సాధ్యం

 – పిఎసిఎస్ చైర్మన్ :పన్నాల ఎల్లారెడ్డి

నవతెలంగాణ-గోవిందరావుపేట : కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సుపరిపాలన సాధ్యం అని పేదల జీవితాల్లో వెలుగులు నిండుతాయని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి సీతక్క చేతిగుర్తుకు ఓటు వేసి  భారీ మెజార్టీతో గెలిపించాలని పిఎసిఎస్ చైర్మన్ పన్నాల ఎల్లారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని పసర గ్రామంలో కాంగ్రెస్  మండల అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ  ఆదేశానుసారం ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఆరు గ్యారెంటీ లపై ప్రచారం నిర్వహిస్తూ ప్రతి ఇంటికి గ్యారెంటీ కార్డు అందించారు. అనంతరం  ఎల్లారెడ్డిమాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్ తోనే సాధ్యమన్నారు. కాంగ్రెస్  సభలో ప్రకటించిన పథకాల గ్యారెంటీ కార్డులను పంపిణీ చేస్తూ ప్రజలకు వివరించామన్నారు. పేద ప్రజలకు అండగా కాంగ్రెస్  ఉంటుందని, ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందన్నారు. అలాగే ఆరు గ్యారంటీ పథకాలను కాంగ్రెస్  అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే అమలు చేస్తామని  అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇండ్ల ద్వారా నిర్మాణానికి 5 లక్షల రూపాయలు, ఎస్సి, ఎస్టీ లకు 6 లక్షల రూపాయలు కల్పిస్తాం అని, ఇండ్ల స్థలాలు లేని వారికి ఉచితంగా 250 గజాల ఇళ్ళ స్థలాన్ని కేటాయించి ఇల్లు నిర్మిస్తామని అన్నారు. ఇప్పటికీ బీఆర్ఎస్ పేదల కోసం సంక్షేమ పథకాలు ఇచ్చారా లేక పార్టీ కోసం ఇచ్చారో అర్థం కాకుండా ఉన్నదని, పార్టీ కార్యకర్తలకు పథకాలు పంచడం దారుణం అని అన్నారు. నియంత పాలనను అంతమొందించి పేదల పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మిరియాల యాదగిరి రెడ్డి, వార్డ్ మెంబర్ చెరుకుల సురేష్ ,సామ సమ్మిరెడ్డి, పగడాల మల్లారెడ్డి, మందడి ఉత్తరయ్య, పన్నాల సమ్మిరెడ్డి, యాస సత్తిరెడ్డి  కొల్లు శ్రీనివాసరెడ్డి, కందాల సమ్మిరెడ్డి గవ్వ సుధాకర్ రెడ్డి, తదితరులు  పాల్గొన్నారు.