న్యూఢిల్లీ: చిన్న ఫైనాన్స్ బ్యాంకుల్లో ఒకటైన ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, దేశంలోని ప్రముఖ స్పెషలైజ్డ్ హెల్త్ ఇన్సూరెన్స్ సంస్థలలో ఒకటైన కేర్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో కార్పొరేట్ ఏజెన్సీ ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు ప్రకటించింది. ఈ ఒప్పందంలో ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కంట్రీ హెడ్ మురళీ వైద్యనాథన్, కేర్ హెల్త్ ఇన్సూరెన్స్ హెచ్‌ఆర్ అండ్ రిస్క్ హెడ్ చౌదరి చంద్రకాంత మిశ్రా పాల్గొన్నారని తెలిపింది. దీంతో తమ వినియోగదారులకు వినూత్నమైన ఆరోగ్య బీమా పరిష్కారాలను అందించనున్నట్లు పేర్కొంది.