రైలు నుంచి పడి యువకుడి మృతి

నవతెలంగాణ – కంటేశ్వర్
వెళ్తున్న రైలు నుంచి పడి గుర్తుతెలియని యువకుడు మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ప్రణయ్ కుమార్ మంగళవారం వెల్లడించారు. నగరంలోని అమ్మ వెంచర్ వద్ద గల పరిసర ప్రాంతంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు కిందపడి వ్యక్తి మృతి చెందాడని అతని వయసు 20-25 ఏళ్ల వరకు ఉంటుందని ఎస్సై తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించినట్లు చెప్పారు. మృతున్ని గుర్తిస్తే, రైల్వే పోలీసులకు లేదా లోకల్ పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.