సీసీ డ్రెయిన్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన

– రూ. 22 లక్షల అంచనాలతో అభివృద్ధి పనులు
నవతెలంగాణ – ఖమ్మం కార్పొరేషన్‌
ఖమ్మం మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని స్థానిక 41 వ డివిజన్‌లో కార్పొరేటర్‌ కర్నాటి క్రిష్ణ ఆద్వర్యంలో మంగళవారం నగర మేయర్‌ పునుకొల్లు నీరజతో నూతన మేజర్‌ బాక్స్‌ డ్రైన్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. రూ.22 లక్షల అంచనాలతో చెరువు బజార్‌ హనుమాన్‌ టెంపుల్‌ వద్ద నుండి లకారం స్టలేజ్‌ డ్రైన్‌ వరకు 250 మీటర్లు నిర్మాణం కానుంది. 39, 40, 41 డివిజన్ల మెయిన్‌ బాక్స్‌ డైన్స్‌ వాటర్‌ ఈ డ్రైన్‌ నుండి లకారం వాగులోకి కలుస్తుందన్నారు. కార్పొరేషన్‌ పరిధిలో గల అన్ని డివిజన్లను దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా మేయర్‌ నీరజ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఖమ్మం నగరాన్ని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ సారధ్యంలో ఎంతో అభివృద్ధి చేస్తున్నామని అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు డిఈ స్వరూపరాణి, ఏఈ నవ్య జ్యోతి, వర్క్‌ ఇన్స్పెక్టర్‌ దాదే సతీష్‌, డివిజన్‌ అధ్యక్ష కార్యదర్శిలు చిన్ని, నవీన్‌, నాయకులు సాయిక్రిష్ణ, కొండల్‌, అప్పారావు, శంకర్‌, కోటేశ్వర్‌రావు, నాగమణి, రెహానా, సుల్తానా, ధనాలకోట అనంతలక్ష్మి, చింతల పద్మ తదితరులు పాల్గొన్నారు.