1059 దరఖాస్తులు ఆమోదం – తహశీల్దార్ లూదర్ విల్సన్

నవతెలంగాణ – అశ్వారావుపేట

ఈ నెల 24 వరకు నియోజక వర్గం వ్యాప్తంగా  2214 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించి 1059 మందికి ఓటుకు ఆమోదం పొందారని మండల ఎన్నికల అధికారి, స్థానిక తహశీల్దార్ లూదర్ విల్సన్ తెలిపారు. ఓటరు జాబితా పురోగతి పై వారం వారం సమీక్షలో భాగంగా శుక్రవారం తన కార్యాలయంలో పార్టీల ప్రతినిధులు, బి.ఎల్.ఒ లు తో సమీక్ష నిర్వహించారు. పాత ఓటరు జాబితాలోని తప్పులను, పొరపాట్లను నూతన దరఖాస్తులు పరిశీలనను బి.ఎల్.ఒ లు ఇంటింటికీ వెళ్ళి నివేదిక తయారు చేస్తున్నారని,వీరికి పార్టీల ప్రతినిధులు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డి.టి సుచిత్ర, ఎలక్షన్ డి.టి లావణ్య, నాయకులు చిరంజీవి(సీపీఎం), చెన్నకేశవరావు(కాంగ్రెస్),
బండి పుల్లారావు(బీఆర్ఎస్), రామక్రిష్ణ(సీపీఐ) తదితరులు పాల్గొన్నారు.