నవతెలంగాణ-మధిర
నవతెలంగాణ దినపత్రిక 2024 క్యాలెండర్ను బుధ వారం మధిర తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ వి.వెంకటేశ్వర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నవతెలంగాణ పత్రిక ద్వారా ఎప్పటికప్పుడు సమస్యలపై వార్తలను ప్రచురించడంలో ముందుజలో ఉంటుందని చెప్పారు. ప్రశ్నించే గొంతుగా పేపర్ ఉందని అన్నారు. అలాగే నవతెలంగాణ రిపోర్టర్ ఏ.అర్జున్ ను మరియు యాజమాన్యాన్ని అభినందిస్తూ నూతన సంవత్సర, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కొత్త సంవత్సరంలో అందరికీ మంచి శుభాలు కలగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మనతెలంగాణ ఆర్సి ఇంచార్జ్ శ్రీనివాసరావు, మనం ఆర్సి ఇంచార్జ్ పి.అరుణ్ కుమార్, ఎర్రుపాలెం సీనియర్ కాంగ్రెస్ నాయకులు, కాంట్రాక్టర్ అనుములు వెంకటకృష్ణారావు పాల్గొన్నారు.