– ప్రముఖ కవి తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరం శంకర్
నవతెలంగాణ – కంటేశ్వర్
ప్రతి ఒక్కరిలో స్పూర్తిని కలిగించే సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రముఖ కవి, తెలంగాణ రాష్ట్ర రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ అన్నారు. ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ కార్యాలయాన్ని గురువారం తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాళేశ్వరం శంకర్ సందర్శించారు. నిరంతరం సామాజిక కార్యక్రమాలు చేస్తూ అందరికి ఆదర్శంగా విరి సేవలు నిలుస్తున్నాయని కోనియాడారు తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు మనస్సుని కదిలించే కార్యక్రమాలని, నిత్యాన్నదానం చేయడం, విదివంచితులకి సపర్యలు చేయడం గొప్ప విషయమన్నారు అనంతరం సంస్థ సభ్యులు నాళేశ్వరం శంకర్ ని గౌరవంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ అధ్యక్షుడు డాక్టర్ మద్దుకూరి సాయిబాబు, గౌరవ అధ్యక్షులు ముస్కు రామేశ్వర్ రెడ్డి, దారం గంగాధర్, చందా జగన్మోహన్, తోగర్ల సురేష్ తదితరులు పాల్గొన్నారు.