భారత సాఫ్ట్ బాల్ జట్టులో ఐదుగురు జిల్లా క్రీడాకారులు…

నవతెలంగాణ – డిచ్ పల్లి
గత నెల 8, 9 తేదీలలో తెలంగాణ మహిళ విశ్వవిద్యాలయం కోటి హైదరాబాద్ క్రీడా మైదానంలో జరిగిన అండర్ -15 బాలికల భారత జట్టు ఎంపిక పోటీలలో జిల్లా క్రీడాకారులు పాల్గొని చక్కని ప్రతిభ కనబరిచి భారత జట్టుకు జిల్లా నుండి ఐదుగురు క్రీడాకారులు ఎంపికై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపూర్ లోని ఆర్డిటి క్రీడ మైదానంలో ఈనెల 26 నుండి జూన్ 02 వరకు జరగనున్న శిక్షణ శిబిరంలో పాల్గొని జూన్ 13 నుండి 17 వరకు తైవాన్ దేశంలోని తైపి లో జరగనున్న అండర్-15 ఏసియన్ చాంపియన్ షిప్ లో పాల్గొననున్నట్లు జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్ లు తెలిపారు.గురువారం డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బీ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులను కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఎంపికైన జిల్లా క్రీడాకారులు..
గుగులోత్ సౌందర్య,(సాంఘిక సంక్షేమ పాఠశాల డిచ్ పల్లి మండలం లోని సుద్ధపల్లి),గోక సాత్విక,,(సాంఘిక సంక్షేమ పాఠశాల డిచ్ పల్లి మండలం లోని సుద్ధపల్లి),గోక శ్రావిక,(సాంఘిక సంక్షేమ పాఠశాల డిచ్ పల్లి మండలం లోని సుద్ధపల్లి),సుంపాక సౌమ్య రాణి,(సాంఘిక సంక్షేమ కళాశాల తాడ్వాయి కామారెడ్డి జిల్లా),దాసరి సరియు,,(సాంఘిక సంక్షేమ పాఠశాల డిచ్ పల్లి మండలం లోని ధర్మారం బీ) లు ఉన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి
మర్కంటి గంగా మోహన్ మాట్లాడుతూ భారత జట్టులో జిల్లా క్రీడాకారులు ఐదుగురు ఎంపిక కావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ భారత జట్టు శిక్షణ శిబిరంలో నూతన మేలుకువలు నేర్చుకొని తైవాన్ లో జరిగే ఏషియన్ ఛాంపియన్ షిప్ లో భారత జట్టును ప్రథమ స్థానంలో నిలుపే విధంగా క్రిడాకరులు కృషి చేయాలి అన్నారు.మున్ముందు ఏషియన్ గేమ్స్, ఒలంపిక్ గేమ్స్ లో క్రీడాకారులు పాల్గొనేలా తమందరము కృషి చేస్తామన్నారు. మంచి అటతీరును కనబర్చి జిల్లా, మండలం, గ్రామం, తల్లిదండ్రులు, అధ్యాపకుల పేరు ప్రఖ్యాతులు సంపాదించే విధంగా చుడాలని వారికి సూచించారు. సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో భారత జట్టుకు ఎంపికైన క్రీడాకారులను జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు వి ప్రభాకర్ రెడ్డి, ఉపాధ్యక్షులు జైపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మర్కంటి గంగా మోహన్, సంయుక్త కార్యదర్శి మర్కంటి సుజాత అకాడమీ కోచ్‌ ఈ.నరేష్ లు పాల్గొన్నారు.

Spread the love