నవతెలంగాణ-ఇల్లందు
పట్టణ ప్రజల ప్రజాభిష్టం మేరకే బొడ్రాయి ప్రతిష్టాపన జరగాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మడత రమా వెంకట గౌడ్ అన్నారు. పదవ వార్డులో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అన్ని వర్గాల ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రజలు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారిని కలుపుకొని సమావేశాలు ఏర్పాటు చేసి బొడ్రాయి ప్రతిష్టాపన గురించి నిర్ణయం తీసుకోవాలన్నారు. బొడ్రాయి ప్రతిష్టాపన ప్రశాంతంగా జరగడానికి ఆరు నెలల కాలం పడుతుందని ఎమ్మెల్యే హరిప్రియ భర్త హరి సింగ్ నాయక్ హడావుడిగా సమావేశాలు నిర్వహించకుండానే ఏకపక్ష నిర్ణయాలు చేయడం సరికాదన్నారు. ఈ పత్రిక సమావేశంలో మాజీ కౌన్సిలర్లు కొప్పుల ఉమారాణి, బాదావత్ సరోజ, శనిగరపు శృతి, పసుపులేటి విజయలక్ష్మి, కమల్ కుమార్ కోరి, అజరు కుమార్, సతీష్, సిహెచ్ రమేష్, కోడి రాజేందర్, కోటగిరి రాజేందర్, మామిడి శివకుమార్, రాయల్ మున్నా, చంద్రమౌళి, మున్నాఫ్ షేక్, బొల్లి రాజు, భరత్, శేషు. పాల్గొన్నారు.