ప్రభుత్వం కాంట్రాక్ట్ అధ్యాపకుల మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలి..

నవతెలంగాణ – డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ కాంట్రాక్టు అధ్యాపకులు గా పని చేస్తున్న వారం దరినీ రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం తెలంగాణ యూనివర్సిటీ లోని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం అధ్యక్షులు డాక్టర్ వి దత్త హరి మాట్లాడుతూ కాంట్రాక్ట్ అధ్యాపకులు అందరూ సమిష్టిగా ఒకే ఒక డిమాండ్ ఉందని,మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. తెలంగాణ యూనివర్సిటీలో దాదాపు 53 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులుగా పనిచేస్తున్నామని, ఇది కాకుండా సౌత్ క్యాంపస్ బిక్నుర్, సారంగాపూర్ క్యాంపస్ లోను కూడా నిరసన కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఇప్పటికే ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. ఇక్కడ పనిచేస్తున్న అధ్యాపకులు ఉన్నత చదువులు చదివి నెట్, సెట్ వంటి ఇతర క్వాలిఫికేషన్ కలిగి ఉండి ఏం ఫీల్, పిహెచ్డి, బోధన అనుభవం కలిగి ఉన్నామన్నారు. ఈ ఉద్యోగానికి కావలసిన అర్హతల కన్నా ఎక్కువ అర్హతలు కలిగి ఉండి మేము ఇక్కడ పనిచేస్తున్నామని, పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కేసీఆర్ రాష్ట్రంలో కాంట్రాక్టు వ్యవస్థ ఉండకుండా చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందని,కాని ఏళ్ దాగడుస్తున్న ఇచ్చిన మాట అమలు కాలేదన్నారు. యూనివర్సిటీ లో గత 13 ఏళ్ల నుండి విద్యా బోధన చేస్తున్నామన్నారు. సిఎం కేసీఆర్ చెప్పినట్టుగా కాంట్రాక్టు వ్యవస్థలో పనిచేస్తున్న అందరిని రెగ్యులరైజ్ చేస్తున్నారని, యూనివర్సిటీలలో పనిచేస్తున్న మమ్ములను కూడా అదేవిధంగా రెగ్యులరైజ్ చేయాలని కోరుకుంటున్నా మన్నారు. ఇందులో భాగంగా 2015లో మా ఒరిజినల్ సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ కూడా చేయడం జరిగిందని, దీని ద్వారా మాలో కొత్త ఉత్సాహం వచ్చినట్లు కనిపించిందని, కానీ ఇప్పుడు కొన్ని శాఖలలో వారిని రెగ్యులరైజ్ చేయడం మమ్ములను మర్చిపోవడం బాధను కలిగిస్తుందని దత్తా హరి వాపోయారు. ఇప్పటికైనా అధ్యాపకుల పై నమ్మకంతో పనిచేస్తున్నామని, ప్రభుత్వం మా ఉద్యోగాలను రెగ్యులరైజ్ చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.ఈ కార్యక్రమం లో కాంట్రాక్ట్ అధ్యాపకులు పాల్గొన్నారు.