యంచలో ఘనంగా చత్రపతి శివాజీ జయంతి

నవతెలంగాణ- నవీపేట్: మండలంలోని యంచ గ్రామంలో ఘనంగా చత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటయోధుడని యువతకు ఆదర్శప్రాయుడని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పెద్దలు పాల్గొన్నారు.