మా వాడాలో మా రాజ్యం ద్వారానే సబ్బండ కులాలకు రాజ్యాధికారం

-ఈనెల 28న జరిగే సభను విజయవంతం చేయాలి
-సీపీయూఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ధైద వెంకన్న
నవతెలంగాణ-భూపాలపల్లి
మా వాడలో మా రాజ్యం ద్వారానే సబ్బండ కులాలకు రాజ్యాధికారం దక్కుతుందని సీపీయూఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ధైద వెంకన్న అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని దళిత బహుజన శ్రామిక విముక్తి పార్టీ కార్యాలయంలో మారోజు వీరన్న 24వ వర్ధంతి కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి సీపీయూఎస్‌ఐ రాష్ట్ర కార్యదర్శి దైద వెంకన్న ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ… మలిదశ తెలంగాణ ఉద్యమ నిర్మాత కులవర్గ పోరాటాల సిద్ధాంత క సీపీయూఎస్‌ఐ పార్టీ (దళిత బహుజన శ్రామిక విముక్తి ) వ్యవస్థాపక కార్యదర్శి కామ్రేడ్‌ మారోజు వీరన్న అణగారిన కులాలకు ఐక్యం చేస్తూ రాజ్యాధికారం దిశగా ప్రయాణం చేయడం జరిగిందన్నారు. ఈ తరుణంలో అగ్రకుల బ్రాహ్మణ మనువాద కబంధ హస్తాల్లో నరహంతక చంద్రబాబు ప్రభుత్వం మారోజు వీరన్న బతికుంటే మా ప్రభుత్వం కూలిపోతుందని బెంబేలెత్తిపోయి ఆగమేఘాలతో మారోజు వీరన్న ను హైదరాబాద్‌ లో పట్టుకొని కరీంనగర్‌ జిల్లా గట్ల నర్సింగాపురం లో 1999 మే 16 తారీకు న బూటకపు ఎన్‌కౌంటర్‌తో రాజకీయ హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరన్న అమరాత్వాన్ని పులికి పుచ్చుకొని ఎన్నో ప్రజా ఉద్యమాలు ఉవ్వెత్తున లేస్తున్నాయని గుర్తు చేశారు. మా గూడెంలో మా రాజ్యం మా తండాలో మా రాజ్యం మేము ఎంత మందిమో మాకు అంత వాటా అని ప్రజా ఉద్యమాలకు దిక్సూచి అయిండ్రు. మారోజు వీరన్న ఇదే తరుణంలో గోదావరి లోయ ఉద్యమ రథశారాదులు మెరికలాంటి విప్లవ వీరులను బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరు తో కామ్రేడ్‌ యాదన్న, స్వరూపక్కలతో పాటు రామేశన్న, సూర్యమన్నా, రంగన్న గోపన్న, నవీన్‌, కంబల్‌, అనిత కమలక్క, దనసారి సాంబన్న తో పాటు 150 మందిలో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరు తో రాజకీయ హత్య చేశారని గుర్తు చేశారు. అమరవీరులందరినీ స్మరించుకుంటూ. మే 28 వ తారీకున ములుగులో జరిగే మారోజు వీరన్న తో పాటు 150 మంది అమరవీరుల సంస్కారణ సభ ను విజయవంతం చేయాలని, కవులు, కళాకారులూ, అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సీపీయూఎస్‌ఐ ములుగు భూపాలపల్లి జిల్లా కార్యదర్శి వావిలాల లక్ష్మణ్‌, దళిత బహుజన రాజ్యాధికార సమాఖ్య ములుగు భూపాలపల్లి జిల్లా కన్వీనర్‌, ధారకొండ శంకర్‌, బాబు తో పాటు తదితరులు పాల్గొన్నారు.