నవతెలంగాణ-గోవిందరావుపేట : తమతో చదువుకున్న చిన్ననాటి మిత్రుడు చనిపోవడంతో తోటి మిత్రులు చనిపోయిన మిత్రుని కుటుంబానికి 48 వేల రూపాయల ఆర్థిక ఆర్థిక సహాయం అందించారు. ఆదివారం మండలంలోని కొత్త నాగారం గ్రామానికి చెందిన సదాశివ చారి అనే వ్యక్తి అనారోగ్యంతో మృతిచెందగా అతని క్లాస్మేట్స్ భోజన ఖర్చులకు 7000/- నగదు 48 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. ఈ సందర్భంగా 1992 సదాశివ చారి పదవ తరగతి తోటి విద్యార్థులు మాట్లాడుతూ చారి మృతి చాలా బాధాకరమని అన్నారు. పేద కుటుంబమైన చారి కుటుంబాన్ని ఎలాగైనా ఆదుకొని ఆర్థిక సహాయం అందించాలని సంకల్పంతో అందరం ఏకమై ఎవరికి తోచినంత వారు ఆర్థిక సహాయం అందిస్తున్నామని తెలిపారు. కాగా తోటి మిత్రులౌదార్యాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ముందు తరాలవారికి మీరు మార్గదర్శకంగా నిలవాలని కోరుకుంటున్నట్లు ఆర్థిక సహాయం అందించిన చిన్ననాటి స్నేహితులను అందరూ అభినందించారు.ఈ కార్యక్రమలో చారి స్నేహితులు సూది రెడ్డి లక్ష్మారెడ్డి, పూజారి సాంబశివరావు, సమ్మిరెడ్డి లింగా రెడ్డి, మల్లి కార్జున్ రావు, బాలబోయిన సమ్మయ్య, అజయ్, కిషన్, రేసు సారయ్య, నర్సింహ రావు, సోమయ్య, సాంబయ్య, తదితరులు పాల్గొన్నారు.