
మండలంలోని అన్ని గ్రామాల్లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని మండల వైద్యాధికారులు విజయవంతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మండలకేంద్రంలో ఎంపీటీసీ జక్కని మధు సూధన్ పిల్లలకు పోలియో చుక్కలను వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ…0-5 సంవత్సరాల వయస్సు గల బాల, బాలికలకు తల్లిదండ్రులు ఖచ్చితంగా పోలియో చుక్కలను వేయించాలని, అంగవైకల్యం రాకుండా చూడాలని, పోలియో రహిత గ్రామాలుగా చేసేందుకు భాగస్వాములు కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి జాకీర్ హుస్సేన్,అంగన్వాడీ టీచర్ చంద్ర కళ, ఆశ వర్కర్ స్వరూప,తదితరులు పాల్గొన్నారు.