
నవతెలంగాణ – ఏర్గట్ల
ఏర్గట్ల మండలకేంద్రంలో కాంగ్రేస్ మండల పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా కాంగ్రేస్ పార్టీ మండలాధ్యక్షుడు సోమా దేవరెడ్డి మాట్లాడుతూ…ఏర్గట్ల గ్రామంలో గత రెండు రోజుల క్రితం బీఆర్ఎస్ నాయకుడిపై వ్యక్తిగతంగా దాడి జరిగితే అది కాంగ్రేస్ పార్టీకి చెందిన వారే దాడిచేశారని, కాంగ్రేస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి అనుచరులే దాడి చేశారని నిందలు వేయడం సరియైంది కాదని అన్నారు. రెండు కుటుంబాల మధ్య జరుగుతున్న ఘర్షణలకు కాంగ్రేస్ పార్టీని,బాల్కొండ నియోజకవర్గ ఇంచార్జ్ ని బద్నాం చేయడం ఏంటని ప్రశ్నించారు.బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుండి ఆ రెండు కుటుంబాలకు ఘర్షణలు జరుగుతున్నాయని,ఎవరు,,ఏ పార్టీకి చెందిన వారు తప్పు చేసినా ఊరుకునేది లేదని,చట్టం ఉందని,దాడి చేసిన వారిపై కేసులు కూడా నమోదు అయ్యాయని అన్నారు.ఇకనైనా బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారు చిల్లర రాజకీయాలను,అబద్ధపు ప్రచారాలను మానుకోవాలని అన్నారు.బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గంలో కాంగ్రేస్ పార్టీ నాయకులపై,అమాయకులైన ప్రజలపై ఎన్ని దాడులు జరిగాయో,ఎన్ని అక్రమ కేసుల్లో ఇరికించారో ప్రజలకు తెలుసునని అన్నారు.మా నాయకుడిపై అనవసర ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు.కాంగ్రేస్ పార్టీ తప్పులను ప్రోత్సాహించదని, నిజానిజాలు తెలుసుకోవాలని హితువు పలికారు.మీరు ఎన్ని అబద్దాలు ప్రచారాలు చేసినా నిజమేదో,ప్రజలకు తెలుసని, రెచ్చగొట్టే రాజకీయాలు చేయకుండా మీరు ప్రతిపక్షంలో ఉన్నారని తెలుసుకుని,కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధికి సహకరించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రేస్ పార్టీ ఉపాధ్యక్షుడు శివన్నోళ్ళ శివకుమార్,జిల్లా బ్లాక్ కాంగ్రేస్ అధ్యక్షులు ఆడేం గంగాప్రసాద్, నాయకులు ముస్కు మోహన్ రెడ్డి,గడ్డం జీవన్,దోంచంద రవి,పన్నాల నర్సారెడ్డి జ్ దండేవోయిన సాయికుమార్,అజయ్,నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.