ఘనంగా తెలంగాణ దశాబ్ది వేడుకలు

నవతెలంగాణ-విలేకరులు
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. పలు జిల్లాల్లో మంత్రులు పాల్గొని జాతీయ జెండాలను ఆవిష్కరించారు. ఆమరవీరుల స్థూపాల వద్ద నివాళులర్పించారు. పదేండ్ల కాలంలో జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై వివరించారు. రాబోయే రోజుల్లో జిల్లాల్లో మరింత అభివృద్ధి చేయడంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి.