దాతృత్వాన్ని చాటిన దంపతులు

నవతెలంగాణ-కేశంపేట
పేదింటి ఆడపడుచుల వివాహాలకు సహాయం అందిస్తు కేశంపేట మండలం పాపిరెడ్డి గూడ సర్పంచ్‌ తాండ్ర విష్ణువర్ధన్‌ రెడ్డి రోజా దంపతులు తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. గురువారం గ్రామానికి చెందిన అబ్బి ప్రేమ్‌ కుమార్‌ కలమ్మల కూ తురు పల్లవి వివాహానికి పుస్తేమెట్టెలు కాను కగా అందించారు. శుక్రవారం అదే గ్రామా నికి చెందిన మైనార్టీ నిరుపేద కుటుంబానికి చెందిన యువతి వివాహానికి తమ వంతు చేయూతను అందించారు. నల్లపూసలలో ధరించే గుండ్లు, చాంద్‌ తార బంగారు బిల్లా ను పెళ్లికూతురు తల్లిదండ్రులు రిజ్వానా మజీ జ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో అబ్దుల్లా తోపాటు తదితరులు పాల్గొన్నారు.