– పనితనాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న నాయకుడు
– వికారాబాద్ జిల్లా ఆనందన్న సైన్యం యువ నాయకులు పంజుగుల అంజిలయ్య
నవతెలంగాణ-బంట్వారం
ప్రజల నాయకుడు, పనితనాన్ని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్న నాయకుడు వికారాబాద్ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు మెతుకు ఆనంద్ అని వికారాబా ద్ జిల్లా ఆనందన్న సైన్యం యువ నాయకులు పంజుగుల అంజిలయ్య అన్నారు. ఆదివారం ఎమ్మెల్యే పుట్టిన రోజు సం దర్భంగా ఎమ్మెల్యేకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా అంజిలయ్య మాట్లాడారు.. ‘మీతో నేను’ కార్య క్రమంతో ప్రజల కష్టాలను తీరుస్తూ ప్రజలందరి హృదయాల్లో ఎమ్మెల్యే సుస్థిర స్థానం సంపాదించుకున్న రని అన్నారు.
మీతో నేను కార్యక్రమం
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మీతో నేను కార్యక్రమంతో నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శించి ప్రతీ గడపగడపలో ప్రతి మనిషిని పలకరిం చారు. పర్యటన ముగిసిన వారం రోజుల్లోనే తాత్కాలిక సమస్యలను వెంటనే పరిష్కారించారు. గ్రామ అభివృద్ధికి నిధులు కేటాయించారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తుండటం ప్రజలలో ఒకడిగా మెదులుతున్నారన్నారు.
మా ఇంటికి రండి
మా ఇంటికి రండి కార్యక్రమం మొదలుపెట్టి తెలంగా ణ ప్రభుత్వం పేదింటి పెళ్లికి అందిస్తున్న కల్యాణలక్ష్మి, షాదిముబారక్ చెక్కులను స్వయంగా ఎమ్మెల్యే స్వయంగా లబ్దిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులను అందిస్తున్నారు.
వికారాబాద్‌లో మెడికల్ కళాశాల
40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి మాజీ మం త్రులు, ఇతర ప్రజాప్రతినిధులకు సాధ్యం కాలేని మెడికల్ కళాశాలను మెతుకు ఆనంద్ సాధించారు. ఎమ్మెల్యేగా గెలిచిన నాలుగేండ్లలోనే అధిష్టానంతో మెసులుకొని వికారాబాద్ ప్రజల ఆకాంక్ష అయినటువంటి మెడికల్ కళాశాలను తీసుకువచ్చిన ఘనత ఎమ్మెల్యేకు దక్కుతుంది.
ప్రజలకు అందుబాటులో ఉంటున్న ప్రజానేత
తన అధికారిక కార్యక్రమాలు ముగించుకొని ప్రజాల కు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో వికారాబాద్ నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, పార్టీ కార్యాలయంలో అనేక చోట్ల అనుని త్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సేవకుడు ఎమ్మెల్యే ఆనంద్ అని అన్నారు. వికారాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి తన శక్తికి మించి శ్రమిస్తూ… అభివృద్ధికి పాటుపడుతున్న ఎమ్మెల్యే డాక్టర్ ఆనంద్ రానున్న రోజుల్లో వికారాబాద్ ప్రజలకు ఎమ్మెల్యేగా, మంత్రిగా తన సేవలు అందించాలని అంజిలయ్య ఆకాంక్షించారు.