రైతు సంక్షేమానికి ప్రభుత్వం పెద్దపీట

– ఎంపీపీ కొప్పు సుకన్య భాష
– ఉత్సవంలా రైతు దినోత్సవం
– రైతులతో కిక్కిరిసిపోయిన వేదికలు,ఎడ్ల బండ్లతో ర్యాలీలు
నవతెలంగాణ-యాచారం
రైతు సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎంపీపీ కొప్పు సుకన్య భాష అన్నారు. శనివారం మండల పరిధిలోని యాచారం, మేడిపల్లి, చౌదర్పల్లి, మాల్‌ రైతు వేదికల్లో తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తోరణాలతో అధికారులు రైతు వేదికలను అందంగా ముస్తాబు చేశారు. నాలుగు గ్రామాల్లో ఎడ్ల బండ్లతో రైతులకు మద్దతుగా ర్యాలీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ ఉత్సవం రైతులకు ప్రోత్సాహాన్ని ఇస్తుందని తెలిపారు. రైతే దేశానికి రాజన్న లక్ష్యంతో ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని హితపు పలికారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రైతు దినోత్సవాన్ని పండుగలా జరుపుకోవడం జరిగిందని చెప్పారు. మన తెలంగాణ రాష్ట్రం దేశ స్థాయిలో వ్యవసాయ రంగంలో మంచి గుర్తింపును తెచ్చుకుందని వివరించారు. రైతు వేదికల దగ్గర వివిధ గ్రామాల రైతులు సందడి చేశారని ఆమె పేర్కొన్నారు. అనంతరం రైతు వేదికల దగ్గర పెద్ద ఎత్తున అన్నదానాలు నిర్వహించాలని తెలియజేశారు. రైతు దినోత్సవాన్ని ఇంత పెద్ద విజయవంతం చేసినందుకు అధికారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ రంగారావు, జడ్పిటిసి చిన్నోళ్ల జంగమ్మ యాదయ్య, ఏపీడి, ఎంపీడీవో విజయలక్ష్మి, డిప్యూటీ తహసిల్దార్‌ ప్రవీణ్‌ కుమార్‌, పిఎసిఎస్‌ చైర్మన్‌ తోటి రెడ్డి రాజేందర్‌ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి సందీప్‌ కుమార్‌, సిఐ లింగయ్య, పిఎసిఎస్‌ చైర్మన్‌ యాదయ్య, సర్పంచులు ఉదరు శ్రీ, హబీబుద్దిన్‌, శ్రీనివాస్‌ రెడ్డి, కవిత, సంతోష, సరిత, నర్సిరెడ్డి, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, డైరెక్టర్లు, ఆశ వర్కర్లు, పెద్ద ఎత్తున రైతులు పాల్గొన్నారు.