ఆద్యంతం వినోదభరితం

విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న హిలేరియస్‌ ఎంటర్‌టైనర్‌ ‘అన్‌ స్టాపబుల్‌’. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రాన్ని ఎ2 బి ఇండియా ప్రొడక్షన్‌లో రజిత్‌రావు నిర్మించారు. ఈనెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ గ్రాండ్‌గా జరిగింది. బ్రహ్మానందం ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
‘దాదాపు యాభై మంది నటీనటులతో ఈ సినిమా చేయడం ఆనందాన్ని ఇచ్చింది. జంధ్యాల, రేలంగి నరసింహరావు,
ఈవీవీ, ఎస్వీ కష్ణారెడ్డి సినిమాల్లో ఇలా తెర నిండుగా నటీనటులు ఉండటం చూశాను. మళ్ళీ ఇంతమందిని ఒక్క దగ్గరికి చేర్చి ఇలాంటి మంచి ఎంటర్‌టైనర్‌ చేయడం అభినందనీయం. చిత్ర బందం అంతా కష్టపడి చేసిన ఈ ప్రాజెక్ట్‌ అద్భుతమైన విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నాను. ఇలాంటి వాళ్ళందరిని మీరందరూ ఆశీర్వదిస్తే పెద్దవాళ్ళు అవుతారు. గొప్పవారు అవుతారు. తర్వాత ప్రతి ఒక్కరూ ఒక బ్రహ్మానందం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అని అన్నారు.