పిడుగుపాటుకు 26 గొర్రెలు మృత్యువాత

నవతెలంగాణ-కుల్కచర్ల
కుల్కచర్ల మండలం సాల్వీడ్‌ గ్రామంలో ఆదివారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన వర్షంతో పిడుగుపాటుకు 26 గొర్రెలు మృత్యువాత పడ్డాయి. గడుసు అంజయ్యకు చెందిన 9 , జోగు బసమ్మకు చెందిన 10, జోగు అంజిలయ్య కు చెందిన 3 కురువ కృష్ణయ్య చెందిన 4 గొర్రెలు మృతువ్యాత పడ్డాయి. పిడుగుపాటుతో ఆర్థికంగా నష్టం జరిగిందని రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలని బాధితులు కోరారు.