సీఎం సభను జయప్రదం చేద్దాం

కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌
బీఆర్‌ఎస్‌ సమన్వయ కమిటీ సమావేశం
నవతెలంగాణ-ఆమనగల్‌
నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలో ఈ నెల 6న నిర్వహించే సీఎం కేసీఆర్‌ బహిరంగ సభను విజయవం తం చేద్దామని కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్క జైపాల్‌ యాదవ్‌ పిలుపునిచ్చారు. కనివిని ఎరుగని రీతిలో లక్ష మందితో బహిరంగ సభను నిర్వహించబోతున్నట్టు ఆయన తెలి పారు. ఆదివారం కల్వకుర్తి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాం పు కార్యాలయంలో ఎమ్మెల్యే అధ్యక్షతన నియోజకవర్గ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సం దర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాగర్‌ కర్నూల్‌ జిల్లా కేంద్రంలో రూ.250 కోట్లతో నూతనంగా నిర్మించిన జి ా్ల కలెక్టర్‌, ఎస్పీ కార్యాలయాలతో పాటు, మెడికల్‌ కళాశాల భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారం భిస్తారని ఎమ్మెల్యే తెలిపారు. బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సీఎం ప్రారంభిం చనున్నట్టు తెలిపారు. నియోజకవర్గం లోని కల్వకుర్తి, వెల్దండ, ఆమనగల్‌, తలకొండపల్లి, మాడుగుల, కడ్తా ల్‌, చారకొండ మండలాలతోపాటు ఆమన గల్‌, కల్వకుర్తి పట్టణాల నుంచి సీఎం కేసీఆర్‌ బహిరంగ సభకు 12,000 మందిని తరలించాలని ఏకగ్రీవంగా సమన్వయ కమిటీ సభ్యులు తీర్మానించినట్టు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సమావేశంలో నియోజకవర్గంలోని సమ న్వయ కమిటీ సభ్యులు, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.