ఉత్తమ గ్రామపంచాయతీ పర్లపల్లి

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్రంలో ఉత్తమ గ్రామ పంచాయతీగా పర్లపల్లి ఎంపికైంది. ప్రపంచ పర్యావరణ దినోత్సవం ఈ పంచాయతీకి అవార్డు అందచేశారు. ప్లాస్టిక్‌ ఘన వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రత, పచ్చదనం విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలంలోని పర్లపల్లి గ్రామం రాష్ట్ర స్థాయిలో ఉత్తమ గ్రామ పంచాయితీ అవార్డు కు ఎంపికైంది. సనత్‌నగర్‌లోని తెలంగాణ కాలుష్యనియంత్రణ మండలిలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు అల్లోళ్ల ఇంద్రకరణ్‌ రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ చేతుల మీదుగా పర్లపల్లి గ్రామ సర్పంచ్‌ శ్రీమతి మాదాడి భారతినర్సింహారెడ్డి ఈ అవార్డును అందుకున్నారు.