ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు ఆర్థిక చేయూత

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
ఇంటర్‌ బైపీసీ విద్యార్థులకు రెండేండ్లపాటు ఆర్థికంగా చేయూత నందించాలని మెటామిండ్‌ అకాడమి ప్రకటించింది. ఈ మేరకు ఆ సంస్థ డైరెక్టర్‌ మనోజ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా పేద బాలబాలికల్లో మొదటి వంద విద్యార్థులకు బైపీసీతోపాటు నీట్‌ కోచింగ్‌, హాస్టల్‌ వసతి కల్పిస్తామని తెలిపారు. ఉచిత రిజిస్ట్రేషన్‌, హాస్టల్‌ వసతి వంటి వివరాలకు 8522958575, 7032264910 నెంబర్లను సంప్రదించాలని కోరారు.