ఆరోగ్య తెలంగాణ సీఎం కేసీఆర్‌ ధ్యేయం

– వైద్యుల సేవలు మరువలేనివి
– వైద్య ఆరోగ్యంలో తెలంగాణ నెంబర్‌ వన్‌
– ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే
మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రాష్ట్రాన్ని ఆరోగ్య రాష్ట్రంగా మార్చడ మే కేసీఆర్‌ లక్ష్యమని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మం చిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధం గా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రమన్నారు. మండలం పరిధిలోని కళ్ళెం జంగారెడ్డి గార్డెన్స్‌లో బుధవారం రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా నిర్వహించిన వైద్య ఆరోగ్య దినోత్స వాన్ని నిర్వహించారు. నియోజకవర్గంలో ఉత్తమ సే వలం దించిన 23మంది డాక్టర్లు, నర్సులు, సిబ్బందికి ఉత్తమ అవార్డులు అందజేశారు. అదే విధంగా మహిళలకు న్యూట్రీషన్‌ కిట్లను అందజేశారు. ఆయ న మాట్లాడుతూ..ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ని ప్రభుత్వ ఆస్పత్రులను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. యాచారం సీహెచ్‌సీని పీహెచ్‌సీగా మార్చడం జరిగిందన్నారు. ప్రతిఆస్పత్రిలో వైద్య సిబ్బందిని నియమించారన్నారు. గతంలో ప్రభుత్వ ఆస్పత్రి అంటే భయపడేవారన్నా రు. కానీ నేడు ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసూతీలను చేసుకుంటున్నారన్నారు. అందుకు కేసీఆర్‌కిట్టు ఇవ్వడంతో ప్రసూతి సహాయం అందజేస్తున్నామన్నా రు. ఇబ్రహీంపట్నంలో సుమారు రూ. 5 కోట్లతో నూతన భవనం నిర్మాణం చేసుకుంటున్నామన్నారు. యాచారం ఆస్పత్రిని అభివృద్ధికి రూ.2 కో ట్లు కేటా యించామన్నారు. మహిళలుకు న్యూట్రీషన్‌ ఫుడ్‌ అం దజేస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ కృపేష్‌, డిప్యూటీ డీఎంహెచ్‌ ఓ ధరణీకుమార్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ సత్తు వెంకటరమణారెడ్డి, ఆర్డీఓవెంకటాచారి, జెడ్పీటీసీ జంగమ్మ, మున్సిపల్‌ కమిషనర్లు, ఎంపీడీఓలు, తహశీల్దార్లు తదితరులున్నారు.