రైతాంగ సమస్యలపై పోరాటాలు

– రైతు సంఘం మండల కార్యదర్శి
సీహెచ్‌ ముసిలయ్య
అ యంపీపటేల్‌గూడలో రైతు సంఘం సమావేశం
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి
రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని రైతు సంఘం మండల కార్యదర్శి సీహెచ్‌ ముసిలయ్య అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీలోని యంపీపటేల్‌గూడలో తెలంగాణ రైతు సంఘ సమావేశం నిర్వహించారు. 21మందితో నూత కమిటీని ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతాంగ సమస్యల పరిష్కారం కోసం సమరశీల పోరాటాలకురైతులు సిద్ధం కావాలని పిలుప ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదన్నారు. నల్లచట్టాలు తీసుకువచ్చి వ్యవసాయాన్ని రూపుమాపాలని చూస్తుందని చెప్పారు. అందుకు వ్యతిరేకంగా నిర్వహించిన పోరాటాల ఫలితంగా నల్ల చట్టాలను రద్దుచేసుకుందన్నారు. స్థానికంగా ఉన్న సమ స్యలను అధ్యాయనం చేసి వాటి పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పారు.
నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ రైతు సంఘం గ్రామ నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా డొంకని యాదయ్య, ప్రధాన కార్యదర్శిగా గుండా శ్రీశైలం, ఉపాధ్యక్షులుగా అంకన్నగారి అంజిరెడ్డి, కామండ్ల జంగయ్య, కాలె చంద్రయ్య, గుబ్బడి సత్తయ్య, సహాయ కార్యదర్శులుగా సోము శ్రీశైలం, బొగిడి నర్సింహ, కుంటిమల్లి నర్సింహ, అంకన్నగారి కరుణాకర్‌ రెడ్డి, పొట్టి నర్సింహ, కొయ్యడ అంజయ్య, గడుసు ఎట్టయ్యలతో పాటు కమిటీ సభ్యు లుగా కాటి యాదయ్య, డొంకని పాండు, కామండ్ల మల్లే ష, బొగిడి శ్రీశైలం, గుండా జంగయ్య, ఎర్కలి వెంకటేష్‌, కొయ్యడ పోచయ్య, కుంటిమల్లి చిన్న జంగయ్యని ఎన్ను కున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు యం రా మక్రిష్ణారెడ్డి, మండల నాయకులు ఆమనగంటి వెం కటేష్‌, బుగ్గరాములు, తులసీగారి నర్సిహ పాల్గొన్నారు.