ఐఎస్‌ఓకు ఎంపికైన కరణ్‌కోట గ్రామపంచాయతీ

జిల్లా కలెక్టర్‌ చేతుల మీదుగా సర్టిఫికెట్‌ అందుకున్న సర్పంచ్‌ వీణా హేమంత్‌
నవతెలంగాణ-తాండూరు రూరల్‌
తాండూరు మండలం కరణ్‌కోట గ్రామం ఇంటర్నేష నల్‌ ఆర్గనైజేషన్‌ ఫర్‌ స్టాండరేషణ్‌ సంస్థ అందించే క్వాలిటీ మేనేజ్మెంట్‌ ఐఎస్‌ఓ 9001.2023. సర్టిఫికెట్‌కు ఎంపికైంది. దీనిని శుక్రవా రం వికారాబాద్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాల యంలో కలెక్టర్‌ నారాయణరెడ్డి చేతుల మీదగా సర్పంచ్‌ వీణా. ఉప సర్పంచ్‌ హేమంత్‌లకు అందజేశారు. ఈ సంద ర్భంగా వారు మాట్లాడుతూ అంతర్జాతీ య స్థాయి నాణ్యత ప్రమాణాలతో పౌ ర సేవలను మౌలిక సదుపాయాలు అందిస్తున్న గ్రామాల జాబితాలో కరణ్‌కోట గ్రామం ఎంపిక కావడం ఆనందంగా ఉంద న్నారు. క్షేత్రస్థాయిలో బృందం పర్యటించి గ్రామాన్ని ఎంపి క చేయడం పట్ల గ్రామస్తులకు పంచాయతీ కార్మికులకు గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు కార్యక్ర మంలో డిఈఎల్‌పిఓ శంకర్‌ నాయక్‌ పంచాయతీ కార్యద ర్శి ఆనంద్‌రావు మండల పంచాయతీ అధికారి రతన్‌ సిం గ్‌ తదితరులు పాల్గొన్నారు.