కులవృత్తులకు ఆర్థిక సహాయ పథకం దరఖాస్తు గడువు పెంచాలి

సీపీఐ(ఎం) జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య
నవతెలంగాణ-పరిగి
కులవృత్తులకు ఆర్థిక సహాయ పథకం దరఖాస్తు గడువు పెంచాలని సీపీఐ(ఎం) జి ల్లా కార్యవర్గ సభ్యులు ఎం.వెంకటయ్య అన్నారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. బీసీ కులాలవారికి వృత్తుల ఆధునీకరణ, పనిముట్లు, ముడిసరుకుల కొనుగో లు కోసం లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించాల న్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమని అన్నారు. రాష్ట్రంలో వృత్తికులాలకు చెందిన లక్షలాదిమంది ఈ పథ కానికి అర్హులు, దరఖాస్తు సమయంలో కులం, ఆదాయం, నివాస ధృవపత్రం, ఆధార్‌, రేషన్‌కార్డులు జత పరచవల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆదాయ పత్రాల కోసం దరఖా స్తు చేసుకుని పేదలు మండల కేంద్రాలలో రోజుల తరబడి పడిగాపులు పడుతున్న పరిస్థితి కనపడుతున్నది తెలిపా రు. మీ సేవా కేంద్రాల్లో జనం క్యూ కడుతున్నారని సర్టిఫికేట్స్‌ జారీ చేయడంలో రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర జాప్యం జరుగుతున్నట్లు తమ దృష్టికి వ చ్చిందని పేర్కొన్నారు. వీటితో పాటు వెబ్‌సైట్‌ ఓపెన్‌ కావడానికి సమయం పడుతున్నదని కొన్ని సందర్భాలలో సర్వర్‌డౌన్‌ అవుతుండ టం వంటి సాంకేతిక సమస్యలు ఎదురౌతున్నా యని అన్నారు. అలాగే అర్హుల్కెనవారికి కొత్త రేషన్‌ కార్డులు ప్రభుత్వం ఇవ్వకపోవడం సమ స్యగా మారిందన్నారు. వృత్తిదారులు అనేకమంది నిరక్షరా స్యులు, అత్యంత వెనకబడినవారు దరఖాస్తు చేసుకోవడా నికి సమయం తక్కువ ఉండటం, ధృవపత్రాలకోసం దర ఖాస్తు చేసుకున్నా అవి సకాలంలో రాకపోవడంతో తాము ఆర్థిక సాయం పొందలేమనే తీవ్ర ఆందోళనతో ఉన్నారని పేర్కొన్నారు. ఈ మేరకు జూన్‌ 6వ తేదీన జీఓ నెం.5 విడుదల చేసి జూన్‌ 20వ తేదీ లోపు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం కోరింది. ఈ గడువులో జూన్‌ 30 వరకు గడువు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాం డ్‌ చేశారు.