యువత దేశానికి వెన్నుముక

యువత జాతీయ క్రీడల్లో రాణించాలి
సినీ హీరో కార్తీకేయ
నవతెలంగాణ-షాబాద్‌
యువత దేశానికి వెన్నుముక అని, యువత జాతీయ స్థాయి క్రీడల్లో రాణించాలని సినీహీరో కార్తీకేయ అన్నారు. షాబాద్‌ పీఆర్‌ఆర్‌ మినీ స్టేడియంలో గత వారం రోజులగా జరిగిన షాబాద్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2 క్రికెట్‌ టోర్నమెంట్లో గెలుపొందిన విజేతలకు బహుమతుల ప్రదానోత్సవ నిర్వ హించారు. ఈ కార్యక్రమానికి సినీ హీరో కార్తీకేయ ముఖ్య ఆతిథిగా హాజరైయ్యారు. ఈ టోర్నమెంట్‌ 8 మ్యాచ్‌లు పోటీపడగా ప్రథమ స్థానంలో ఆర్సీబీ టీం సభ్యలకు రూ. 50 వేల నగదుతో పాటు మెమోంటో, ద్వితీయ స్థానంలో ఎంఐ టీం సభ్యులకు రూ. 30 వేల నగదుతో పాటు మెమోంటో, తతీయ స్థానంలో నిలిచిన జీటీ టీం సభ్యులకు రూ. 20 వేల నగదుతో పాటు, మెమోంటోలు టీపీసీ కార్యదర్శులు ఎలు గంటి మధుసూదన్‌ రెడ్డి, రఘువీరారెడ్డిలతో కలిసి అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లా డుతూ… గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో క్రీడాల్లో నైపుణ్యం కలిగి ఉన్నారనీ, ఇలాంటి టోర్నమెంట్‌ ఏర్పాటు చేయడంతో వారి ప్రతిభ బయటపడు తోందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్నట్టు గుర్తుచేశారు. క్రికెట్‌ అంటే తనకేంతో ఇష్టమని, క్రీడా కారులను ప్రోత్సహించేందుకు తనవంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరించి ముందుకు సాగాలన్నారు. ఈ క్రీడాపోటీలను రాణున్న రోజుల్లో షాబాద్లో నియోజకవర్గ స్థాయిలో నిర్వహించి, క్రీడాకారులను ప్రోత్సహాం అందిస్తామని టీపీసీసీ ప్రధానకార్యదర్శి మధుసూదన్‌రెడ్డి నిర్వాకులు అభిరాంరెడ్డిలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ కాంగ్రెస్‌ నాయకులు దేశమోళ్ల అంజనేయులు, సున్నపు వసంతం, షాబాద్‌ దర్శన్‌, శ్రీనివాస్‌ గౌడ్‌, తమ్మలి రవీందర్‌, బుర్ర అంజనేయులుగౌడ్‌, రాంరెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, జయమ్మవెంకట్‌ రెడ్డి, అశోక్‌, మల్లేష్‌, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు కావలి చంద్రశేఖర్‌, ప్రధానకార్యదర్శి శ్రీరాంరెడ్డి, నాయకులు కుద్దూస్‌, రవీందర్నాయక్‌, సుభాష్రెడ్డి, నర్సిం హులు, జంగయ్య, కుమ్మరి రాజేందర్‌, జాకీర్‌, చెన్నయ్య, చంద్రయ్య, ఆయా గ్రామాల క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.