ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక విద్యాబోధన

– డిజిటల్‌ తరగతులను ప్రారంభించిన సర్పంచ్‌ విజయమ్మ, చైర్మన్‌ ఎల్లారెడ్డి
నవతెలంగాణ-పెద్దేముల్‌
ప్రభుత్వ పాఠశాలలో ఆధునిక బోధన పద్ధతిపై డిజిటల్‌ తరగతులను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్ట డం అభినందనీయమని సర్పంచ్‌ ద్వావరి విజయమ్మ పాఠశాల చైర్మన్‌ ఎల్లారెడ్డి అన్నారు. మంగళవారం మండలంలో వివిధ పాఠశాలలో రాష్ట్ర దశాబ్ది ఉత్స వాల్లో భాగంగా విద్య దినోత్సవం సందర్భంగా జాతీ య జనన ఆవిష్కరించి, విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులకు ఉచిత పాఠ్యపు స్తకాలు, ఏకరూప దుస్తులను పంపిణీ చేశా రు. పలువురు మాట్లాడుతూ… ప్రభుత్వ పా ఠశాలలో కల్పించిన వసతులను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత విద్యాభివృద్ధిలో గణనీయమైన విద్యార్థులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో ప్రధానో పాధ్యాయులు మల్లమ్మ, నర్సహుయ్య, ఇన్‌ చార్జ్జీ ప్రధానోపాధ్యాయులు నరేందర్‌ రెడ్డి, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యా యులు, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.