ప్రతి రోజూ యోగ ఆసనాలు చేయాలి

డాక్టర్‌ మహేందర్‌ కుమార్‌ రెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
ప్రతి ఒక్కరూ యోగా సాధన చేయాలని లయన్స్‌ క్లబ్‌ జిల్లా వైస్‌ గవర్నర్‌ డాక్టర్‌ జి. మహేందర్‌ కుమార్‌రెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ ఆఫ్‌ కందుకూరు ఆధ్వర్యంలో జరిగిన యోగ అవగాహన, సాధన కార్యక్రమంలో యువత, ఔత్సాహికులు శ్రద్ధతో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో చిప్పలపల్లి ప్రకృతి కుటీర్‌ స్వామీజీ నిత్య యోగ సాధకులైన వారి శిష్యులతో పాల్గొని, ముఖ్యమైన కొన్ని యోగాసనాలను నేర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆధునిక జీవనంలోని వేగం మనిషికి శారీరక మానసిక అనారోగ్యం కలిగిస్తుందన్నారు. యోగ అంటే కేవలం ఆసనాలు వేయడం మాత్రమే కాదనీ, అష్టాంగ యోగపై అవగాహన పెంచుకుని, దాన్ని పాటిస్తే శారీరక, మానసిక ప్రశాంతత సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్‌ కుంచకూరి వెంకటేశం గుప్త, బీజేపీ మండలాధ్యక్షులు అశోక్‌గౌడ్‌, సెక్రెటరీ నిమ్మ అంజిరెడ్డి, సీనియర్‌ నాయకులు సురసాని భూంరెడ్డి, దేశం సత్తిరెడ్డి, నల్లబోలు నర్సింహా రెడ్డి, ఊటు మహేందర్‌, సురసాని లక్ష్మారెడ్డి, ఏబీవీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.