తెలంగాణలో మత ఘర్షణలు కట్టుదిట్టం

జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి
నవతెలంగాణ-కందుకూరు
తెలంగాణ రాష్ట్రం ఏర్పాడిన తర్వాత సీఎం కేసీఆర్‌ మత ఘర్షణలు కట్టుదిట్టం చేశారని జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా బుధవారం ఆధ్యాత్మిక దినోత్సవ సందర్భంగా గూడూరు గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో, మజీద్‌లో బాచుపల్లి గ్రామంలోని చర్చిల్లో పూజా ప్రార్థనల కార్యక్రమంలో జడ్పిటిసి బొక్క జంగారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ ఆలయాలు, మజీదులు, చర్చిల ఏర్పాటుకు అనేక నిధులు ఇస్తున్నారని గుర్తు చేశారు. అనతి కాలంలోనే యాదాద్రిని ఆలయం నిర్మించి, పెద్ద ఎత్తున అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి దక్కిందన్నారు. అన్ని మతాలను గౌరవించుకునే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌, రంజాన్‌కు, క్రైస్తవులకు, బతుకమ్మ పండుగల సందర్భంగా నిరుపేదలకు నూతన దుస్తులు అందజేస్తున్నట్టు గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ సురసాని సురేందర్‌ రెడ్డి, సొసైటీ చైర్మన్‌ దేవరశెట్టి చంద్రశేఖర్‌, బాచుపల్లి, గూడూరు సర్పంచులు యాలాల శ్రీనివాస్‌, పోలేమోని శ్రీలతశ్రీహరి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షులు సురసాని రాజ శేఖర్‌ రెడ్డి, బాచుపల్లి, మీరఖాన్‌పేట్‌ ఎంపీటీసీలు సురేష్‌, కాకి రాములు, సీనియర్‌ నాయకులు కాకి దశరథ, బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ, ఎస్టీసెల్‌ అధ్యక్షులు లచ్చ నాయక్‌, డైరెక్టర్లు పొట్టి ఆనంద్‌, నరసింహ, బీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షులు దామోదర్‌గౌడ్‌, బీసీసెల్‌ అధ్యక్షులు పాండుగౌడ్‌ నియోజకవర్గం యూత్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ తాళ్ల కార్తీక్‌, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల సోషల్‌ మీడియా కన్వీనర్‌ బొక్క దీక్షిత్‌ రెడ్డి, మైనారిటీ అధ్యక్షులు ఆలీ, సీనియర్‌ నాయకులు బాలమల్లేష్‌ యాదవ్‌, యూత్‌ ఉపాధ్యక్షులు గోరింకల రామకష్ణ, హనుమంత్‌ యాదవ్‌, నాయకులు రాజు, షకీల్‌, హనీఫ్‌, శ్రీకాంత్‌ తదితరులు ఉన్నారు.