అమరుల సంస్మరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

జిల్లా కలెక్టర్‌,సి.నారాయణ రెడ్డి
నవతెలంగాణ వికారాబాద్‌ కలెక్టరేట్‌
జిల్లా కేంద్రంలో గురువారం నిర్వ హించే అమరుల సంస్మరణ కార్యక్రమా న్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి కోరారు. బుధ వారం ఆయన మాట్లాడుతూ అమరుల సంస్మరణ కార్యక్రమంలో రెండు నిమిషాలు మౌనం పాటించి, అమరులకు శ్రద్ధాంజలి ఘటిస్తూ అమరుల సంస్మరణ తీర్మానాలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి అశోక్‌ కుమార్‌, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మున్సిపల్‌ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభోత్సవానికి ముస్తాబైన తెలంగాణ అమరవీరుల స్థూపం
వికారాబాద్‌ పట్టణంలో తెలంగాణ అమరవీరుల స్థూపం ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం వికా రాబాద్‌ కలెక్టర్‌ నారాయణరెడ్డి, ఎమ్మెల్యే మెతుకు ఆనంద్‌ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గురువారం మంత్రి సబితాఇంద్రా రడ్డి ముఖ్య అతిథిగా హాజరై స్థూపాన్ని ఆవిష్కరిస్తారని తెలిపారు. ప్రజలు అధికసంఖ్యలో హాజరై విజయవం తం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతిని ధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.