
నవతెలంగాణ-సుల్తాన్ బజార్
కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణుల ఉద్యోగ భద్రత కల్పించాలని తెలంగాణ రాష్ట్ర దేవాలయాల కళ్యాణకట్టల నాయి బ్రాహ్మణ సంఘం ( జేఏసీ ) అధ్యక్షుడు రాచకొండ జానకిరామ్ నాయి అన్నారు. శనివారం బొగ్గులకుంట లోని దేవాదాయ ధర్మాదాయ కార్యాలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కొన్ని ఏళ్లుగా గా కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను ప్రభుత్వం వెంటనే పర్మినెంట్ చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ 2017 మార్చి 13న దేవాలయ కళ్యాణకట్టలో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను ఎండోమెంట్ నిబంధనలకు అనుగుణంగా ఉద్యోగులుగా గుర్తించి 15 రోజుల్లో జీవోను విడుదల చేస్తామని ప్రగతి భవన్ లో ప్రకటించారని గుర్తు చేశారు. సీఎం చెప్పినట్లుగానే కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులను వెంటనే పర్మినెంట్ చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. దేవస్థానంలో దశలవారీగా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని అవసరాలకు అనుగుణంగా నాయి బ్రాహ్మణ సంఘ పెంచుకునేందుకు దేవస్థానం యజమాన్యం చైర్మన్ కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణుల సంఘం ఆమోదించిన తీర్మానాం అవలంబించే వారన్నారు ఈ విధానాన్ని దేవస్థానం యజమాన్యం భవిష్యత్తులో కూడా తమ అభిప్రాయాన్ని దేవస్థానం పర్యాలోకి తీసుకోవాలని కోరారు. కొత్తవారిని తీసుకునే ఆలోచనను దేవాదాయ శాఖ విరమించుకోవాలని కమిషనర్ కు విన్నవించారు ఈ విషయంపై ఆయన సానుకూలంగా స్పందించారని చెప్పారు. రాజకీయా ఒత్తిడిలకు లోనై మాకు చేటు చేసే అభిప్రాయం తీసుకున్నట్లయితే కళ్యాణ కట్టల్లో నిర్వాదిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కళ్యాణకట్ట నాయి బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు , జేఏసీ ఉపాధ్యక్షులు రాచకొండ రమేష్ నాయి. నల్లగొండ నాచారం నరసింహనాయి.ఉపాధ్యక్షులు కందునూరి భగవాన్ నాయి. ప్రధాన కార్యదర్శి రాచకొండ హరికుమార్ నాయి. కోశాధికారి వెంకటేష్ నాయక్. వేములవాడ రాచకొండ శ్రీనివాస్ నాయి. యాదగిరిగుట్ట పాలవంచ కిషన్ నాయి. రాచకొండ సుదర్శనాయి. రాచకొండ నాగరాజు నాయి. పాలవంచ ఆంజనేయులు నాయి. పెద్ద ఎత్తున కళ్యాణ కట్టల్లో పనిచేస్తున్న నాయి బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు.