రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేస్తున్న బీజేపీ ప్రభుత్వం

– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ
– మత ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న మోడీ
– మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవడంలో కేంద్రం విఫలం
– సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదు
– అర్హులైన పేదలందరికీ డబుల్‌ బెడ్రూం ఇల్లు, మూడెకరాల భూమి ఇవ్వాలి
– 27న రంగారెడ్డి జిల్లాకు చేరుకోనున్న సీపీఐ(ఎం) బస్సు యాత్ర
– ప్రజా సమస్యలపై కలెక్టర్‌ రేట్ల ముట్టడిని విజయవంతం చేయండి
నవతెలంగాణ-యాచారం
దేశంలోని కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభు త్వం రాజ్యాంగ విలువల్ని విధ్వంసం చేస్తుందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జాన్‌ వెస్లీ విమర్శించారు. ఆదివారం మండల పరిధిలోని చింతుల్ల సీపీఐ(ఎం) గ్రామ శాఖ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం జరిగింది. కార్యక్రమానికి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మతోన్మాదాన్ని పెంచి పోషిస్తుందని మండిపడ్డారు. మహిళలపై లౌగికదాడులు జరుగుతున్న ప్రధాని మోడీ చూస్తూ ఉండిపోయారు తప్ప చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విప్లమయ్యారని మండిపడ్డారు. దేశంలో గుడిసె ఉన్నవారికి ఇల్లు ఇస్తామని, 2022 సంవ త్సరం నాటికి గుడిసె లేని దేశంగా తయారు చేస్తామని ఇచ్చిన హామీ తుంగలో తొక్కారన్నారు. బీజేపీి ప్రభుత్వం ఎన్నికల్లో పేద ప్రజలకు ఇచ్చిన హామీని ఏ ఒక్కటీ నెరవేర్చ కుండా మత విధ్వంసాలకు పాల్పడుతున్నారని ఆరోపిం చారు. దేశంలో పేదలకు ఇండ్లు ఇస్తామన్న హామీ అమలు జరపలేదు. అలాగే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్న హామీని మోడీ తుంగలో తొక్కేశారన్నారు. రూ. 44 లక్షల కోట్ల కేం ద్ర బడ్జెట్లో పేద, మధ్య, మైనార్టీల కుటుంబాల సంక్షేమంలో మోడీ కోత విధించారన్నారు. ఉపాధి హామీ చట్టానికి దాదాపు కోట్ల రూపాయలను కేటాయించకుండా నిర్వీర్యం చేసేందుకు కేంద్రం కుట్ర చేసిందన్నారు. పేద ప్రజలంతా మోడీకి తగిన బుద్ధి చెప్పాలని సూచించారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయిందన్నారు. సీఎం కేసీఆర్‌ హామీల్లో ఇచ్చిన డబుల్‌ బెడ్రూం ఇల్లు, పేద లకు మూడెకరాల భూమి, పేదలకు ఇంటి జాగాలు హామీ లు పేపర్లకే పరిమితమయ్యాయని వివరించారు. రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికీ డబుల్‌ బెడ్రూం ఇల్లు ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. సీఎం కేసీ ఆర్‌ ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చకుండా ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నారన్నారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో బస్సు యాత్ర నడుస్తుందని గుర్తుచేశారు. 27వ తేదీన రంగారెడ్డి జిల్లాలో సీపీఐ(ఎం) బస్సు యాత్ర ఉంటుందని వివరించా రు. నేడు జరిగే ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ము ట్టడి, మండల రెవెన్యూ కార్యాలయం ముందు జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జాన్‌ వెస్లీ పిలుపు నిచ్చారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మండల కార్యదర్శి ఆ లంపల్లి నరసింహ, ధర్మన్నగూడ సర్పంచి మండల భాష య్య, సీపీఐ(ఎం) మండల కార్యదర్శి వర్గ సభ్యులు చందు నాయక్‌, అలంపల్లి జంగయ్య, చింతుల్ల సీపీఐ(ఎం) గ్రామ శాఖ కార్యదర్శిలు ఎంజె వినోద్‌ కుమార్‌, మస్కు మహేం దర్‌, గోపిక శ్రీనివాస్‌, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు విప్లవ కుమార్‌, గ్రామ సీపీఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు తదిత రులు పాల్గొన్నారు.