కొండ రెడ్ల గ్రామాలను సందర్శించిన నాబార్డు డీడీఎం సుజీత్ కుమార్

నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని కన్నాయిగూడెం పంచాయతీలోని గోగులపూడి ని సోమవారం నాబార్డు డీడీఎం సుజీత్ కుమార్ సందర్శించారు. గవర్నర్ తమిళ సై దేశాల మేరకు దమ్మపేట మండలంలోని పూచికుంట, అశ్వారావుపేట మండలంలోని గోగులపుడి గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొండ రెడ్ల జీవనోపాధి మెరుగుదల కోసం ఏ ఏ పనులు చేపట్టాలనే అంశం పై వారి అభిప్రాయాలు సేకరించారు.ఈ ప్రాంతంలో పండే పంటలు,జీవన విధానం, ఆహార పంటలు,వారికి ఉన్న భూములు వివరాలు అడిగితెలుసుకున్నారు. బాబుల్ రెడ్డి మాట్లాడుతూ మా గ్రామంలో 32 కుటుంబాలు కొండ రెడ్లు ఉన్నారని, ప్రతి కుటుంబానికి 1, 2 ఎకరాలు భూమి మాత్రమే ఉందని, ప్రధాన పంట పత్తి పండిస్తామన్నారు.ఒకరిద్దరికి జీడి తోటలు ఉన్నాయని వారికి తెలిపారు. గుబ్బల మంగమ్మ దేవాలయం వద్ద పూజారులుగా, ఐటీడీఏ సహకారంతో దుకాణాలు నడుపుకుంటు జీవనం సాగిస్తున్నామని నాబార్డు డీడీఎం తెలిపారు. కోళ్లు, తేనెటీగలు పెంపకం చేపడతారా అని డీడీఎం అడిగారు.మహిళలకు టైలరింగ్, ఎంబ్రాయిడర్ శిక్షణ ఇప్పిస్తామని,డ్వాక్రా మహిళలకు లోన్ సౌకర్యం కలిపిస్తాని, చిరుధాన్యాలు పండిస్తే మిషనరీ ఏర్పాట్లు పరిశీలిస్తామని కొండరెడ్లకు వివరించారు.వెదురు అల్లికలు శిక్షణ పూర్తి చేసుకున్నామని అల్లికల డిజైన్లను డీడీఎంకు చూపించారు.మార్కెట్ సౌకర్యం ఆరా తీశారు.అక్కడ నుంచి గుబ్బల మంగమ్మ దేవాలయం ఆవరణలోని దుకాణాలను పరిశీలించారు. ఈయన వెంట భద్రాచలం రెడ్ క్రాస్ సోసైటీ ఇన్చార్జి రవికుమార్, కొండరెడ్లు బాబుల్రెడ్డి,దుర్గారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి తోపాటు పలువురు కొండరెడ్లు పాల్గొన్నారు.