తక్కువ ధరకే దుప్పట్లు, బెడ్ షీట్లు, మహిళల సూట్లు అమ్ముతున్న ముఠా మీ వీధుల్లో తిరుగుతున్నారా అయితే వారితో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు కొత్తూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ నరసింహారావు. ప్రజలను చైతన్య పరిచేందుకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. బీదర్, గుల్బర్గాకు చెందిన గ్యాంగ్ స్టార్లు మధ్యాహ్న సమయంలో దుప్పట్లు ఇతర దుస్తులు చౌకైన ధరలకు విక్రయిస్తామనే నెపంతో వీధుల్లో తిరుగుతున్నారని పేర్కొన్నారు. వారంతా వీధుల్లో తిరుగుతూ రెక్కీ నిర్వహిస్తారని, దొంగతనం చేయడానికి అనువైన ఇళ్లను గుర్తించి లోపలికి ప్రవేశించి దోచుకుంటారని వివరించారు. వీధుల్లో అనుమానాస్పదంగా తిరుగుతున్న అటువంటి వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఏమాత్రం అనుమానం కలిగిన పోలీసులకు సమాచారం అందించాలని ఆయన సూచించారు.