అద్దె, కరెంట్ బిల్లు చెల్లించలేదని తహసిల్దార్ కార్యాలయానికి తాళం

నవతెలంగాణ- దంతాలపల్లి
తహసిల్దార్ భవనానికి అద్దె డబ్బులు, విద్యుత్ బిల్లు, చెల్లించడం లేదని యజమాని చలమల్ల వెంకన్న తాళం వేసి న ఘటన మండల కేంద్రంలో శుక్రవారం చోటుచేసుకుంది. 2016లో దంతాలపల్లి మండలం కొత్తగా ఏర్పాటు అయింది. అప్పటినుంచి తహసిల్దార్ కార్యాలయం అద్దె భవనంలో కొనసాగిస్తున్నారు. ఒక సంవత్సరం నుంచి సుమారు 45వేలు అద్దె, విద్యుత్ బిల్లు రూ ఒక లక్ష బకాయి ఉన్నట్లు యజమాని వెంకన్న పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఉన్నంత అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోవడంతో ఉదయమే కార్యాలయానికి తాళం వేసినట్లు ఆయన స్పష్టం చేశారు.10: 30 గంటలకు కార్యాలయానికి వచ్చిన సిబ్బంది తహసిల్దార్ భవన యజమానితో మాట్లాడారు. నెల రోజుల్లో అద్దె డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామని. ప్రభుత్వం నుంచి నిధులు రాకపోతే సొంత డబ్బులు ఇస్తామని హామీ ఇవ్వడంతో తాళం తెరిచారు. దీంతో సిబ్బంది మధ్యాహ్నం ఒంటిగంట వరకు సమీప చెట్ల కిందనే నిరీక్షించాల్సి వచ్చింది.